/rtv/media/media_files/2025/07/12/allu-arjun-to-play-4-distinct-roles-in-atlee-next-movie-2025-07-12-21-02-06.jpg)
allu arjun to play 4 distinct roles in atlee next movie
'పుష్ప 2' తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేయనున్న నెక్స్ట్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం (AA22 / AA22xA6) గురించి రోజుకో కొత్త వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Also Read: చనిపోయిందనుకుని అంత్యక్రియలు.. ఆఖరి నిమిషంలో లేచి గుక్కపెట్టి ఏడ్చిన శిశువు!
నాలుగు పాత్రల్లో బన్నీ?
తాజా సమాచారం ప్రకారం.. అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే మొదటిసారిగా ఒకే సినిమాలో నాలుగు పాత్రల్లో నటించబోతున్నాడట. ఇందులో తాత, తండ్రి, ఇద్దరు కుమారులుగా అల్లు అర్జున్ కనువిందు చేయనున్నారని తెలుస్తోంది. మూడు తరాల కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతోంది.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్!
ముందుగా అట్లీ అల్లు అర్జున్‌ను ద్విపాత్రాభినయంలో చూపించాలని అనుకున్నారని.. తాత, తండ్రి పాత్రలకు వేరే నటులను తీసుకోవాలని ప్లాన్ చేశారని వార్తలు వచ్చాయి. అయితే, అల్లు అర్జున్ ఈ నాలుగు పాత్రలను తానే పోషించాలని పట్టుబట్టగా, లుక్ టెస్ట్ తర్వాత అట్లీ కూడా అందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇది సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తుందని, ప్రేక్షకులు ఒకే టిక్కెట్‌పై నాలుగు అల్లు అర్జున్‌లను చూసే అవకాశం లభిస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read:ఢిల్లీలో దారుణం.. కూలిన నాలుగు అంతస్తుల భవనం!
పాన్ వరల్డ్ ప్రాజెక్ట్
సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్యాన్-వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో హాలీవుడ్ స్థాయి విజువల్స్, విఎఫ్ఎక్స్ ఉంటాయని ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ వీడియోల ద్వారా స్పష్టమైంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న వంటి స్టార్ హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఒక హాలీవుడ్ నటుడు కూడా విలన్ పాత్రలో నటించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, ఈ నాలుగు పాత్రల అంశంపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇది నిజమైతే, అల్లు అర్జున్ అభిమానులకు ఇది నిజమైన పండగే అవుతుంది. 2027లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.