Allu Arjun : శ్రీతేజ్‌ను చూడగానే అల్లు అర్జున్ ఎమోషనల్

కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను చూడగానే  బన్నీ ఎమోషనల్ అయ్యారు.  శ్రీతేజ్‌ తలపై చేయి పెట్టి మాట్లాడేందుకు ట్రై చేశారు.  పక్కనే ఉన్న  శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో కూడా బన్నీ మాట్లాడారు.  శ్రీతేజ్‌ త్వరగా కోలుకుంటాడాని ధైర్యం చెప్పారు.

New Update
Bunny kims

Bunny kims Photograph: (Bunny kims)

కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun)  జనవరి 07వ తేదీ మంగళవారం పరామర్శించారు.  అల్లు అర్జున్ వెంట నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. హాస్పిటల్ బెడ్ పైన ఉన్న శ్రీతేజ్ ను చూడగానే  బన్నీ ఎమోషనల్ అయ్యారు.  శ్రీతేజ్‌ తలపై చేయి పెట్టి మాట్లాడేందుకు బన్నీ ట్రై చేశారు.  పక్కనే ఉన్న  శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో కూడా అల్లు అర్జున్ మాట్లాడారు.  శ్రీతేజ్‌ త్వరగా కోలుకుంటాడాని ఆయనకు ధైర్యం చెప్పారు. శ్రీతేజ్ భవిష్యత్తు కోసం తను తోచిన సహాయం చేసేందుకు ఎప్పుడు  తాను సిద్ధంగా ఉంటానని బన్నీ హామీ ఇచ్చారు.  ఈ సందర్భంగా శ్రీతేజ్‌ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం శ్రీతేజ్‌ కోలుకుంటున్నాడని..  రికవరీ కావడానికి కొంత సమయం పడుతుందని డాక్టర్లు  ఆయనకు తెలిపారు.  దాదాపు 20 నిమిషాల పాటు ఆసుపత్రిలో ఉన్న బన్నీ అక్కడినుంచి వెళ్లిపోయారు.  

Also Read :  ధనుష్ తర్వాత చంద్రముఖి మేకర్స్..నయనతారకు మరోసారి లీగల్ నోటీసులు

Also Read :  ప్రభాస్‌ Vs అజిత్.. ఒకే రోజు రెండు సినిమాలు!

అల్లు అర్జున్ పై కేసు ఏంటీ?

2024 డిసెంబర్ 04వ తేదీన పుష్ప2 (Pushpa 2) మూవీ బెనిఫిట్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో గాయపడిన ఆమె కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  దీనిపై రేవతి  భర్త భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.  అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరుచగా..  కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించడంతో పోలీసులు ఆయన్ను జైలుకు తరలించారు.  ఇది జరిగిన కాసేపటికే హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో మరుసటిరోజు విడుదలయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్  కుటుంబానికి పుష్ప2 మేకర్స్  అండగా నిలిచారు.  హీరో అల్లు అర్జున్ కోటి రూపాయలు, డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు తలో రూ. 50 లక్షల పరిహారం అందజేశారు. 

Also Read : కేటీఆర్‌కు బిగ్ షాక్.. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

Also Read :  'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్.. పంచులతో వెంకీమామ రచ్చ రచ్చ

Advertisment
తాజా కథనాలు