విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా జనవరి 14న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన పాటలు సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ పాటల్ని మ్యూజిక్ లవర్స్ రిపీట్ మోడ్ లో వింటున్నారు.
తాజాగా, 'సంక్రాంతికి వస్తున్నాం' ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నేడు నిజామాబాద్‌లో ఘనంగా నిర్వహించగా, చిత్రబృందం మొత్తం హాజరైంది. ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా సూపర్‌స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.
Bringing you the perfect PANDAGA CINEMA with everything you need to celebrate this Sankranthi ❤️🔥#SankranthikiVasthunam Trailer out now 💥
— Sri Venkateswara Creations (@SVC_official) January 6, 2025
— https://t.co/54nwhRFrmy #సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025.
Victory @VenkyMama @AnilRavipudi… pic.twitter.com/wSchC9biR5
ట్రైలర్‌ను పరిశీలిస్తే. కథలో ఓ వ్యక్తి కిడ్నాప్ అయి ప్రభుత్వానికి నష్టం జరిగే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనటానికి ఎక్స్-పోలీస్ ఆఫీసర్ వెంకటేష్‌ను విధుల్లోకి తీసుకురావడం కోసం, పోలీసులు మీనాక్షిని పంపిస్తారు. కథలో వింత మలుపులు ఏర్పడతాయి.
పెళ్లయిన వెంకటేష్ జీవితంలోకి మీనాక్షి రావడం, ఆయన భార్య, మాజీ ప్రేయసి మధ్యలో అతని పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఎంటర్టైనింగ్ గా చూపించబోతున్నారు. ట్రైలర్ మొత్తం ఫుల్ కామెడీ, పంచులతో నింపేశారు. అనిల్ రావిపూడి - వెంకటేష్ గత చిత్రాలైన ఎఫ్2, ఎఫ్3 కి మించిన ఎంటర్టైన్మెంట్ ను ఈ సినిమాలో ఉంటుందని ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. చూస్తుంటే పండక్కి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్స్ హౌజ్ ఫుల్స్ అవ్వడం గ్యారెంటీగా కనిపిస్తోంది.