HBD MegaStar Chiranjeevi: సాధారణ యువకుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన చిరంజీవి తన అద్భుతమైన నటన, డ్యాన్స్, స్టైల్ తో 'మెగాస్టార్' గా ఎదిగారు! ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఇండస్ట్రీలోకి వచ్చి 40ఏళ్ళు అయినా అభిమానుల్లో ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. కుర్ర హీరోల నుంచి సీనియర్ నటుల అందరూ మెగాస్టార్ కి అభిమానులే. 'పునాదిరాళ్లు' నుంచి 'విశ్వంభర' వరకు ఆయన సినీ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తి. నేడు మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినీ, వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.. ఈరోజుతో మెగాస్టార్ 69 ఏళ్ళు పూర్తి చేసుకొని 70వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.
సినిమా కెరీర్ గురించి ఎవరికీ తెలియని విషయాలు
తొలి పారితోషికం
ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న మెగాస్టార్ ఎంతో చిన్న స్థాయికి నుంచి తన కెరీర్ ని ప్రారంభించారు. నటుడిగా చిరంజీవికి తీసుకున్న మొదటి కేవలం రూ. 1,116 మాత్రమే. నిర్మాత జయకృష్ణ చేతుల మీదుగా ఈ రెమ్యునరేషన్ తీసుకున్నారు.
తొలి సినిమా ఏదంటే
చిరంజీవి నటించిన మొదటి సినిమా 'పునాది రాళ్ళు' అయినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద విడుదలైన సినిమా మాత్రం 'ప్రాణం ఖరీదు'. అయితే ఆయన పుట్టినరోజున సెప్టెంబర్ 22న ఈ సినిమా విడుదలైంది. అందుకే చిరంజీవికి ఈ సినిమా అంటే చాలా ప్రత్యేకం.
రూ. 1.25 కోట్ల రెమ్యునరేషన్
1992లో విడుదలైన 'ఘరానా మొగుడు' సినిమాతో చిరంజీవి అప్పట్లో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా రికార్డు సృష్టించారు. ఈ సినిమాకు ఆయన పారితోషికం రూ. 1.25 కోట్లు తీసుకున్నారు. ఆ సమయంలో ఆయన అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారట.
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/22/hbd-megastar-2025-08-22-09-51-36.png)
ఖైదీకి ముందు విలన్
'ఖైదీ' సినిమాతో యాక్షన్ హీరోగా మారక ముందు, చిరంజీవి కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా పోషించారు. కమల్ హాసన్ నటించిన 'ఇది కథ కాదు'లో ఆయన విలన్‌గా నటించారు.
ఆస్కార్ వేడుకకు వెళ్ళిన మొదటి దక్షిణ భారత నటుడు:
1987లో, చిరంజీవి ఆస్కార్ అవార్డుల వేడుకకు హాజరైన మొదటి దక్షిణ భారత నటుడిగా పేరు పొందారు.
ఒకే సంవత్సరంలో 14 సినిమాలు
1980, 1983 సంవత్సరాల్లో చిరంజీవి ఏకంగా 14 సినిమాల్లో నటించారు, ఇది ఒక నటుడికి చాలా అరుదైన విషయం.
ఒకే హీరోయిన్‌తో ఎక్కువ సినిమాలు
చిరంజీవి కెరీర్‌లో విజయశాంతితో ఎక్కువ సినిమాల్లో నటించారు. దాదాపు 19 సినిమాల్లో ఈ జంట కనిపించింది.
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/22/hbd-megastar-2025-08-22-09-51-54.png)
వ్యక్తిగత జీవితం గురించి కొన్ని తెలియని విషయాలు
సీఏ అవ్వాలనుకున్నారు
చిన్నతనంలో చిరంజీవికి సినిమాలు అంటే చాలా ఇష్టం ఉన్నప్పటికీ, మొదట చార్టెడ్ అకౌంటెంట్ (CA) చదవాలని అనుకున్నారు. కానీ, విధి ఆయనను సినిమా రంగం వైపు నడిపించింది.
సేవా కార్యక్రమాలు
చిరంజీవి కేవలం నటుడిగానే కాకుండా గొప్ప సంఘ సేవకుడిగా కూడా పేరుపొందారు.1998లో ఆయన స్థాపించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ఏర్పాటు చేసి లక్షలాది మందికి సహాయం చేశారు. కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి ఎంతోమందికి ప్రాణదానం చేశారు