/rtv/media/media_files/2025/06/09/j7LGGmQZmNtWPlVULajd.jpg)
akhil- nagarjuna chose same wedding pattern
నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని వివాహ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ క్రమంలో అమల- నాగార్జున పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో అమల- నాగార్జున వివాహ వస్త్రాలు అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ వివాహ వస్త్రాల్లో ఓ ప్రత్యేకత ఉంది! 33 ఏళ్ల క్రితం అమల- నాగార్జున పెళ్లి బట్టలు.. ఇప్పుడు అఖిల్- జైనాబ్ పెళ్లి బట్టలు రెండూ ఒకే ప్యాటర్న్, ఒకే రంగులో ఉండడం గమనార్హం. అప్పుడు నాగార్జున వైట్ కుర్తా ధరించగా.. అమల క్రీమ్ కలర్ సారీ విత్ పట్టు బార్డర్ ధరించారు. అలాగే ఇప్పుడు అఖిల్ వైట్ షర్ట్, పంచె ధరించగా.. జైనాబ్ క్రీమ్ కలర్ సారీ విత్ పట్టు బార్డర్ ధరించారు. అంతేకాదు ఇద్దరూ మెడలో మల్లెపూలతో చేసిన దండలనే వేసుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఇది చూసిన నెటిజన్లు సర్ప్రైజ్ అవుతున్నారు. ఇది అనుకోకుండా జరిగిందా? లేదా ప్లాన్డ్ గా అఖిల్- జైనాబ్ ఇలా డిజైన్ చేయించుకున్నారా? అని అనుకుంటున్నారు.
#KingNagarjunaAmala #AkhilZainab Same pattern... ❤️ pic.twitter.com/R2z5vyH8uw
— NagaKiran Akkineni (@NagaKiran60) June 8, 2025
Also Read : కేరళ కోజికోడ్ తీరంలో భారీ ప్రమాదం.. నలుగురు సిబ్బంది గల్లంతు
Also Read : పెళ్లి పీటలు ఎక్కబోతున్న విరూపాక్ష డైరెక్టర్.. ఘనంగా ఎంగేజ్మెంట్ ! ఫొటోలు వైరల్
గ్రాండ్ గా రిసెప్షన్
అఖిల్ జూన్ 7 తెల్లవారుజామున 3:35 నిమిషాలకు తన ప్రేయసి జైనాబ్ మెడలో మూడు ముళ్ళు వేశారు. జూబ్లీహిల్ లోని నాగార్జున నివాసంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఎంతో ప్రైవేట్ గా వీరి వివాహ వేడుక జరిగింది. వివాహ వేడుక ఇంట్లోనే సింపుల్ గా జరిగినప్పటికీ.. ఆదివారం రిసెప్షన్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ వేడుకకు సినీ తారలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖుల హాజరయ్యారు. అగ్ర హీరోలు మహేష్ బాబు దంపతులు, వెంకటేష్ ఫ్యామిలీ, రామ్ చరణ్, చిరంజీవి దంపతులు సందడి చేశారు. కోలీవుడ్ హీరోలు యష్, సూర్య కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
Also Read : నానబెట్టిన లవంగాలతో అద్భుతమైన ప్రయోజనాలు.. ఇలా తిన్నారంటే..!!
Akkineni Akhil Marriage | latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | akkineni akhil & zainab ravdjee marriage