/rtv/media/media_files/2025/06/09/WBzncZsQ8Yv2ZRVzuIhn.jpg)
Virupaksha director Karthik Dandu
డైరెక్టర్ కార్తీక్ దండు (Director Karthik Dandu) త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా తన ప్రేయసి హర్షితను నిశ్చితార్థం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ (Engagement) వేడుక ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీరి పెళ్లి ముహూర్తానికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
Also Read : నితిన్ 'తమ్ముడు' ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్.. అనౌన్స్మెంట్ వీడియోలో హీరోయిన్ల అల్లరి!
Also Read : గోండ్ కటిరా ఎప్పుడైనా తిన్నారా..? తింటే ఏమి జరుగుతుందో తెలుసా..!!
'విరూపాక్ష' ఫేమ్
కార్తీక్ దండు సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నారు. దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్ గా, నిర్మాతగా వ్యవహరించారు. అయితే సుకుమార్ నుంచి శిష్యరికం పొందిన యంగ్ డైరెక్టర్లలో కార్తీక్ కూడా ఒకరు. ప్రస్తుతం కార్తీక్ అక్కినేని హీరో నాగ చైతన్యతో ఓ అడ్వెంచర్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్సమెంట్ ఇంకా చేయనప్పటికీ.. అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి. ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరీ కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తుంది.
Also Read: Akhil- Zainab Wedding: 33 ఏళ్ల క్రితం సీన్ రిపీట్.. నాగార్జున- అఖిల్ పెళ్లి బట్టల్లో ఇది గమనించారా?
latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | Karthik Dandu engagement