Akhanda 2: ‘అఖండ-2’ షూటింగ్ వీడియో లీక్.. బాలయ్య లుక్ చూస్తే పూనకాలే!

బాలయ్య బాబు ‘అఖండ 2’ షూటింగ్ సెట్స్ నుంచి అదిరిపోయే వీడియో ఒకటి లీక్ అయింది. అందులో బాలయ్యను పవర్ ఫుల్ పాత్ర కోసం రెడీ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఓ మహిళ బాలయ్యకు మేకప్ వేస్తున్నట్లు అందులో చూడవచ్చు. ఆ లుక్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

New Update
BALAYYA AKHANDA 2 MOVIE SETS BALAKRISHNA MAKUP VIDEO LEAKE

BALAYYA AKHANDA 2 MOVIE SETS BALAKRISHNA MAKUP VIDEO LEAKED

బాలయ్య బాబు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాది డాకూ మహారాజ్ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు బద్దలు కొట్టింది. ఇప్పుడు మరో సినిమాతో బాలయ్య బాబు బిజీ బిజీగా ఉన్నారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ మూవీ చేస్తున్నాడు. 

Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

సీక్వెల్‌గా ‘అఖండ 2’

ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 2021లో వచ్చిన ‘అఖండ’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటి వరకు వరుస ఫ్లాపులతో సతమతమైన బాలయ్యకు ఈ సినిమా మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఆ సమయంలో బాలయ్య బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను నెలకొల్పింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా ‘అఖండ 2’తో వస్తున్నాడు. 

Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్‌ టికెట్లు!

రూ.150 కోట్ల బడ్జెట్‌

ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని సమర్పకురాలిగి ఉంది. 

Also Read: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు

వీడియో లీక్

ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య బాబు ‘అఖండ 2’ కు సంబంధించి ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బాలకృష్ణను పవర్ ఫుల్ పాత్రకోసం రెడీ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఓ మ్యాకప్ డిజైనర్ బాలయ్యను అఖండ పాత్రలో సిద్ధం చేస్తుంది. నుదిటిన నామాలు దిద్ది.. బొట్టు పెట్టింది. అలాగే గడ్డంపై కూడా వైట్ కలర్‌పూసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!

Balayya Boyapati Movie | Balayya New Movie | akhanda 2 update | Akhanda 2 | boyapati | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు