Saif Ali Khan - Sreeleela : యంగ్ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా బిజీగా కొనసాగుతోంది. ఇటీవలే 'పుష్ప 2' లో 'కిస్సిక్' పాన్ ఇండియా లెవెల్లో ఈ ముద్దుగుమ్మ పేరు మారుమోగింది. ఈ పాటతో నార్త్ లోనూ శ్రీలీల క్రేజ్ బాగా పెరిగింది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లోనూ ప్రయాణం మొదలు పెట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. Also Read : సంధ్యా థియేటర్ ఘటన.. అల్లు అర్జున్ పై మెగా డాటర్ షాకింగ్ కామెంట్స్ ! ఇబ్రహీం అలీఖాన్ తో శ్రీలీల తాజాగా శ్రీలీల (Sreeleela) బాలీవుడ్ నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిలిమ్స్ ఆఫీస్ వద్ద సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తో కలిసి కనిపించడం కొత్త చర్చలకు తెర లేపింది. ఇద్దరు తమ క్యాజువల్ లుక్స్ లో ఫొటోలకు ఫోజిలిస్తూ నెటిజన్లను తెగ ఎట్రాక్ట్ చేశారు. దీంతో త్వరలో వీరిద్దరూ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ లో నటించబోతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇబ్రహీం అలీఖాన్ ఇప్పటికే సినిమాల్లో తన ఎంట్రీపై దృష్టి పెట్టారు. ఇక ఈ కొత్త జోడీ వెండితెరపై ఎలా కనిపించబోతుందో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. #IbrahimAliKhan and #Sreeleela share a fun moment as the former recreates her iconic #Kissik step.Sreeleela, who won hearts with her performance in the song from #Pushpa2, was recently seen with Ibrahim. Reportedly, they were spotted outside the #Maddock office🎥 #pallavpaliwal pic.twitter.com/o92RSYGNnB — HT City (@htcity) January 8, 2025 Also Read : గోవాలో రికార్డ్ స్థాయిలో పర్యాటకులు.. చైనాదంతా అబద్ధపు ప్రచారం రీసెంట్ గా మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో రూపొందిన స్త్రీ 2 భారీ విజయాన్ని అందుకుంది. రూ. 874.58 కోట్లతో గతేడాది అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా హిందీ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. మ్యాడ్ డాక్ హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లతో కొత్త తరహా సినిమాలను నిర్మిస్తోంది. 2028 వరకు వరుసగా హారర్ కథలను లైన్ లో పెట్టడం విశేషం. 2025లో 'థమ', శక్తి షాలిని, 2026లో భేడియా 2, చాముండ, 2027లో స్త్రీ 3, మహా ముంజ్య, 2028లో పెహలా మహాయోధ్, దూస్రా మహాయోధ్ సినిమాలను తీసుకొస్తున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. మరి ఇందులో శ్రీలీల, ఇబ్రహీం కలిసి చేయబోయే సినిమా ఏంటో చూడాలి. Also Read : ఫార్ములా ఈ కేసు.. ఇవ్వాళ ఏసీబీ విచారణకు ఆ ఇద్దరు Also Read: HBD Yash: నాడు జేబులో రూ.300.. ఇప్పుడు చేతినిండా సినిమాలు.. ఇది కదా యష్ రేంజ్!