Telangana ACB : ఫార్ములా ఈ కేసు.. ఇవ్వాళ ఏసీబీ విచారణకు ఆ ఇద్దరు

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఇవ్వాళ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, HMDA మజీ  చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డి లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో అరవింద్ కుమార్ A2గా ఉండగా.. బీఎల్‌ఎన్‌రెడ్డి  A3గా ఉన్నారు.

New Update
acb telangana

acb telangana Photograph: (acb telangana)

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. 2025 జనవరి 08వ తేదీ బుధవారం రోజున  ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, HMDA మజీ  చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డి లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఈ కేసులో అరవింద్ కుమార్ A2గా ఉండగా.. బీఎల్‌ఎన్‌రెడ్డి  A3గా ఉన్నారు.  అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్‌రెడ్డి లను ఎలాంటి ప్రశ్నలు సంధించాలో అధికారులు ప్రశ్నావలిని సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అనంతరం రేపు అంటే జనవరి 09వ తేదీన  అరవింద్ కుమార్ ఇదే కేసులో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా..  10 తేదీన బీఎల్‌ఎన్‌రెడ్డి హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈడీ అధికారులు వీరికి నోటీసులు కూడా జారీ చేశారు.  వాస్తవానికి వీరిద్దరి ఈడీ విచారణ జనవరి 03,04వ తేదీల్లోనే జరగాల్సి ఉండగా.. వీరు విచారణకు హాజరు కాలేదు.  అవినీతి ఆరోపణలపై ఏసీబీ... నిధుల మళ్లింపు, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ విచారణలు చేపట్టాయి. 

కేటీఆర్ కు బిగ్ షాక్ 

ఈ ఫార్మర్ రేసు కేసులో తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం...మధ్యంతర ఉత్తర్వులు సైతం ఎత్తివేసింది.  ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు తెలిపింది. అందరికి రూల్ అఫ్ లా వర్తిస్తుందని హైకోర్టు వెల్లడించింది. అయితే హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  కేటీఆర్ లీగల్ టీమ్ ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఇవాళ లేదా ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేటీఆర్ కంటే ముందు ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేయడం కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. 

అదో లొట్టపీసు కేసు 

అయితే తనపై పెట్టిన కేసులో ఏమీ లేదని, అదో లొట్టపీసు కేసు అని  కేటీఆర్ అంటున్నారు.  అవినీతిలో పట్టుబడిన వారికి ప్రతీది అవినీతిలానే కనిపిస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అవినీతి లేదని తెలిసీ తనపై కేసు పెట్టి కాంగ్రెస్ నేతలు శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగపరంగా తనకున్న హక్కు ప్రకారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశానన్నారు.   న్యాయపరంగా ఈ అంశంపై పోరాటం చేస్తానని, లాయర్లతో విచారణకు వెళ్తానని కేటీఆర్ స్పష్టం చేశారు.

Also Read :  సంక్రాంతికి గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారో తెలుసా..దాని వెనుక ఉన్న కథేంటంటే!

Advertisment
తాజా కథనాలు