/rtv/media/media_files/2024/12/31/dK2qdKOQHc2OkZEOt1bs.jpg)
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో. తన నటనతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులు సలామ్ రాఖీభాయ్ అనేలా చేశాడు. ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ బాక్స్ రికార్డులను తిరగరాశాడు.
/rtv/media/media_files/2024/10/23/OZKjv5E9f9MpW2LTxH02.jpg)
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు చెందిన యష్ ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. యష్ తల్లి హౌజ్ వైఫ్, తండ్రి ఒక బస్సు డ్రైవర్ గా పనిచేసేవారు. యష్ బాగా చదువుకోవాలని అతడి తల్లిదండ్రుల కల.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kgf-2-review-140422-2.jpg)
కానీ, యష్ కి చదువు కంటే నటనేపైనే ఎక్కువ ఆసక్తి. 10వ తరగతిలోనే చదువు మానేయాలని అనుకున్న యష్.. తల్లిదండ్రుల కోసం కాలేజీకి వెళ్లారు. ఆ తర్వాత పూర్తిగా నటన వైపు మొగ్గు చూపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/kgf-chapter-2-hits-1000-crore-mark-001.jpg)
తల్లిదండ్రులకు మాత్రం యష్ నటుడిగా మారడం అస్సలు ఇష్టం లేదు. యష్ బాగా చదువుకోవాలని ఉండేది. 300 రూపాయలు జేబులో పెట్టుకుని సూపర్ స్టార్ కావాలనే కోరికతో బెంగళూరు వచ్చిన యష్ నటన పై తనకున్న ప్రేమ, పట్టుదలతో అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా ఎదిగారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-20-2-jpg.webp)
మొదట్లో ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డబ్బుల కోసం టీవీలో కూడా పనిచేశారట. ఆ తర్వాత 2007 సినిమాలు మొదలు పెట్టిన యష్ తన రెండవ సినిమాతోనే నటుడిగా సత్తా చాటాడు.
/rtv/media/media_files/OAmZRUtp6dk1Z8oP0dGi.jpg)
2008 లో యష్ నటించిన 'మొగ్గిన మనసు' చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాలు నటించిన యష్ కేజీఎఫ్ తో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాడు. ఈ సినిమాతో ఇండియన్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు.
/rtv/media/media_files/2024/12/31/dK2qdKOQHc2OkZEOt1bs.jpg)
కేజీఎఫ్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో యష్ పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగింది. 300 రూపాయలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన యశ్.. ఇప్పుడు కోట్లు సంపాదించే స్థాయికి ఎదిగారు.