/rtv/media/media_files/2025/08/07/raashii-khanna-in-white-pic-one-2025-08-07-19-57-40.jpg)
కెరీర్ ప్రారంభంలో వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్లిన యంగ్ బ్యూటీ రాశీ ఖన్నా గత మూడు సంవత్సరాలుగా కాస్త స్లో అయ్యింది. టాలీవుడ్ ఈ అమ్మడు అవకాశాలు బాగా తగ్గాయి. తెలుగులో చివరిగా 2022లో నాగచైతన్య సరసన థాంక్యూ సినిమాలో మెరిసింది.
/rtv/media/media_files/2025/08/07/raashii-khanna-in-white-pic-two-2025-08-07-19-57-40.jpg)
ఆ తర్వాత మూడేళ్ళ పాటు తెలుగులో ఒక్క ప్రాజెక్ట్ కూడా చేయలేదు రాశీ. ఈ గ్యాప్ లో హిందీ, తమిళ్ సినిమాల్లో మెరిసింది.
/rtv/media/media_files/2025/08/07/raashii-khanna-in-white-pic-three-2025-08-07-19-57-40.jpg)
ఇప్పుడు 2025లో 'తెలుసు కదా', 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
/rtv/media/media_files/2025/08/07/raashii-khanna-in-white-pic-four-2025-08-07-19-57-40.jpg)
ప్రస్తుతం రాశీ తెలుగు కంటే బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఇటీవలే హిందీలో 'కేసరి ది చాప్టర్ 2' సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది.
/rtv/media/media_files/2025/08/07/raashii-khanna-in-white-pic-five-2025-08-07-19-57-40.jpg)
ఈ సినిమా తర్వాత ఫర్హాన్ అక్తర్ సరసన '120 బహదూర్' సినిమా చేస్తోంది. ఇటీవలే మూవీ టీజర్ విడుదలవగా.. రాశీ ఆర్మీ ఆఫీసర్ మేజర్ షైతాన్ సింగ్ భార్య పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది.
/rtv/media/media_files/2025/08/07/raashii-khanna-in-white-pic-six-2025-08-07-19-57-40.jpg)
దేశభక్తి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. రాశీ బాలీవుడ్ ప్రయాణంలో ఇదొక ముఖ్యమైన అడుగును సూచిస్తోంది.
/rtv/media/media_files/2025/08/07/raashii-khanna-in-white-pic-seven-2025-08-07-19-57-40.jpg)
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే వైట్ సూట్ లో దర్శనమిచ్చి అందరిని ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2025/08/07/raashii-khanna-in-white-pic-eight-2025-08-07-19-57-40.jpg)
వైట్ సూట్ రాశీ స్టన్నింగ్ ఫోజులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన రాశీ ఫ్యాన్స్ లైకులు వర్షం కురిపిస్తున్నారు.