/rtv/media/media_files/2025/08/19/food-poisoning-2025-08-19-07-26-57.jpg)
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) నటిస్తున్న ధురంధర్ మూవీ సెట్లో దారుణం జరిగింది. ఫుడ్ పాయిజన్(food-poisoning) జరిగి 120మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం లద్దాక్‌లోని లేహ్ జిల్లాలో జరుగుతోంది. ఈ సందర్భంగా 600 మంది సిబ్బంది డిన్నర్ చేశారు. అయితే తిన్న వెంటనే కొందరు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. వెంటనే వారందరినీ దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఫుడ్ శాంపిళ్లను అధికారులు సేకరించి పరీక్షలకు పంపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. "కొంతమందికి తీవ్రమైన డీహైడ్రేషన్ వచ్చింది, మరికొందరికి కడుపు నొప్పి, వాంతులు, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్, తలనొప్పి ఉన్నాయి అని వైద్యులు తెలిపారు. దాదాపు 600 మందికి ఆహారాన్ని వడ్డించారని, అందులో 120 మంది అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు.
Also Read : Rahul Sipligunj Engagement Photos: రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు చూశారా.. జోడీ ఎంత బాగుందో?
Some thing bad...📛
— Always Bollywood (@AlwaysBollywood) August 18, 2025
120 crew members on the set of #RanveerSingh’s #Dhurandhar fell sick in Leh due to food poisoning ...
Investigation by local police is going on... pic.twitter.com/fl0dPlwkh0
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఆదిత్య ధార్ దర్శకత్వం వహిస్తున్న ధురంధర్ ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్, ఇందులో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ చిత్రం 1970-80ల కాలంలో భారత నిఘా సంస్థ (RAW) నిర్వహించిన నిజమైన రహస్య కార్యకలాపాల నుండి ప్రేరణ పొందిందని తెలుస్తోంది. రణవీర్ సింగ్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారని సమాచారం. రణవీర్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా (జూలై 6, 2025) సినిమా ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను పెంచింది.
Also Read : Janhvi Kapoor Photos: అబ్బా ! లెహంగాలో 'పరమ్ సుందరి' ఫోటోషూట్ అదిరింది.. కుర్రకారు ఫిదా!