Petrol price: ఎప్పటిలానే..పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు!
రెండోరోజు కూడా క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే, భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేయలేదు. ఈరోజు వీటి ధరలు యధాతథంగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.