/rtv/media/media_files/2025/02/11/yRfB1iBsYU7oeHCYb0ju.jpg)
Stock Market On Monday
ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అదనంగా 25% సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. దీంతో స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. బ్యాంకింగ్, లోహ, చమురు షేర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. దీని ప్రభావంతో నిన్నంతా స్టాక్ ఒడిదుడుకులకు గురైంది. సెన్సెక్స్ ఉదయం 71 పాయింట్ల నష్టంతో 77,789.30 వద్ద ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కదలాడిన సూచీ, ఇంట్రాడేలో 753.3 పాయింట్లు క్షీణించి, 77,106.89 పాయింట్లకు పడిపోయింది. చివరకు 548.39 పాయింట్ల నష్టంతో 77,311.80 వద్ద ముగిసింది. నిఫ్టీ 178.35 పాయింట్లు కోల్పోయి 23,381.60 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 23,316.30- 23,568.60 పాయింట్ల మధ్య కదలాడింది.
Also Read : తెలంగాణలో మందు బాబులకు షాక్.. భారీగా ధరల పెంపు!
రూ. 6 లక్షల కోట్లు ఆవిరి...
సెన్సెక్స్ 30 షేర్లలో 23 కుదేలయ్యాయి. పవర్ గ్రిడ్, టాటాస్టీల్, టైటన్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, ఇన్ఫోసిస్, యాక్సిక్ బ్యాంక్ అన్నీ నష్టపోయాయి. టాటా స్టీల్, పవర్ గ్రిడ్ షేర్లు 3% కంటే ఎక్కువ పడిపోయాయి. దీని కారణంగా బీఎస్ఈలో కొన్ని సంస్థల మార్కెట్ విలువ డ్రాప్ అయిపోయింది. దీంతో నిన్న ఒక్కరోజు రూ. 6.11 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. ప్రస్తుం మార్కెట్ విలువ రూ.417.82 లక్షల కోట్ల (4.77 లక్షల కోట్ల డాలర్ల)కు పరిమితమైంది.