/rtv/media/media_files/2025/10/19/washing-machine-offers-2025-10-19-07-36-50.jpg)
Washing Machine Offers
వేసవికాలం ప్రారంభం కావడంతో పలు ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు కొత్త సేల్‌లను ప్రకటిస్తు్న్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ ‘big saving days’ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో వాషింగ్ మెషీన్లపై అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. అందువల్ల మీరు ఎప్పటి నుంచో ఒక మంచి వాషింగ్ మెషీన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇదే సరైన సమయం. ఇప్పుడు వాషింగ్ మెషీన్లపై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం.
Washing Machine Offers
VW Semi Automatic Washing Machine
ఫ్లిప్‌కార్ట్‌లో VW 7.5 kg Semi Automatic Top Load Washing Machineపై భారీ తగ్గింపు ఆఫర్ ఉంది. దీని అసలు ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. అయితే ఇప్పుడు దీనిని సగం కంటే తక్కువ ధరకే కొనుక్కొని ఇంటికి పట్టికెళ్లొచ్చు. దీనిపై ఫ్లిప్‌కార్ట్ 63 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ తగ్గింపుతో ఈ వాషింగ్ మెషీన్‌ను కేవలం రూ.6,999లకే సొంతం చేసుకోవచ్చు.
అలాగే దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ.700 వరకు తగ్గింపు పొందొచ్చు. ఇంకా ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్/ డెబిట్ కార్డుపై రూ.350 వరకు లభిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా నోకాస్ట్ ఈఎంఐ ఉంది. అలాగే రూ.1330 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు.
ఈ వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు ప్యాకేజీలో కొన్ని వస్తువులు లభిస్తాయి. అందులో 1 యూనిట్ వాషింగ్ మెషీన్, డ్రైన్ హోస్ అంటే వాటర్ బయటకు వెళ్లే పైపు, ఇన్లెట్ పైపు, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, క్లిప్ రింగ్, స్కూృ ఫిట్టింగ్స్, అలాగే ఎలుకల నుండి సేఫ్టీ కోసం ‘ప్రొటెక్టివ్ రాట్ మాష్ కవర్’ అందించారు. అలాగే ఇందులో మూడు ఆప్షన్లు ఇచ్చాడు. అవి క్విక్ వాష్, స్పిన్ & రిన్స్, జెంటిల్ వాష్. అందులో క్విక్ వాష్ అనేది తక్కువ సమయంలో బట్టలు ఉతకడానికి పనిచేస్తుంది.
అలాగే స్పిన్ & రిన్స్ అనేది బట్టలను జాడించి, ఆరబెట్టడానికి యూజ్ అవుతుంది. ఇంకా జెంటిల్ వాష్ అనేది పట్టు బట్టలు లేదా సున్నితమైన డ్రెస్‌లు పాడవకుండా ఉతకడానికి ఇది ఉపయోగపడుతుంది. కాగా దీనికి వారంటీ కూడా ఉంది. కంపెనీ 2 ఏళ్ల సమగ్ర వారంటీని అందించింది. అలాగే 5 ఏళ్ల మోటార్ వారంటీ పొందొచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ వారంటీ కేవలం తయారీ లోపాలకు మాత్రమే వర్తిస్తుంది. మీరు ఈ ఐటెమ్‌ను కొనుక్కోవాలనుకుంటే ముందుగా రివ్యూ రేటింగ్స్ చూసి కొనుక్కోవడం బెటర్.
Follow Us