Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. నేడు టాప్‌లో ఉన్న ఈ షేర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే డబ్బే డబ్బు!

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 312 పాయింట్ల లాభంతో 80,121 వద్ద ఉంది. ఇక నిఫ్టీ 95 పాయింట్ల పెరుగుదలతో 24,522 వద్ద ట్రేడ్ అవుతోంది. టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎన్‌టీపీసీ కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయి.

New Update
stock market today

stock market today

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగానే ఉన్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే లాభాలతో దూసుకెళ్తున్నాయి. అయితే ఉదయం 9:30 గంటల సమయానికి సెన్సెక్స్ 312 పాయింట్ల లాభంతో 80,121 వద్ద ఉంది. ఇక నిఫ్టీ 95 పాయింట్ల పెరుగుదలతో 24,522 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే నేడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 17 పైసలు తగ్గి 88.26 వద్ద ఉంది. నేడు స్టాక్ మార్కెట్‌లో కొన్ని కంపెనీల షేర్లు లాభాల్లో నడుస్తుండగా, మరికొన్ని నష్టాల్లో నడుస్తున్నాయి. 

ఇది కూడా చూడండి: LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు!

ఈ షేర్లు లాభాల్లో..

నిఫ్టీ సూచీలో టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎన్‌టీపీసీ, హీరో మోటార్‌కార్ప్, ట్రెంట్ వంటి కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి. జియో ఫైనాన్షియల్, రిలయన్స్, మారుతీ సుజుకీ, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, మరియు ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి స్టాక్స్ నష్టాల్లో కదలాడుతున్నాయి. అయితే లాభాల్లో నడుస్తున్న షేర్లలో  నేడు ఇన్వెస్ట్ చేస్తే భారీగా షేర్లు విలువ పెరిగి డబ్బు వస్తుందని నిపుణులు అంటున్నారు. 

నేడు లాభాలకు కారణం ఇదే..

స్టాక్ మార్కెట్లలో ధరలు కాస్త తగ్గినప్పుడు, పెట్టుబడిదారులు వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఈరోజు కూడా కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు పెరిగాయి. ఇది ఇన్వెస్టర్లకు బాగా కలసి వచ్చింది. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని, ఇది ఆర్థికంగా లాభదాయకమని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడుస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియగా దేశీయ మార్కెట్లు మిశ్రమంగానే ముగిశాయి. 

ఇది కూడా చూడండి: New Rules: గ్యాస్ నుంచి క్రెడిట్ కార్డు వరకు..  నేటి నుంచి మారనున్న రూల్స్ ఇవే!

Advertisment
తాజా కథనాలు