New Rules: గ్యాస్ నుంచి క్రెడిట్ కార్డు వరకు..  నేటి నుంచి మారనున్న రూల్స్ ఇవే!

నేటి నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, గ్యాస్ ధరలు, వెండికి హాల్‌మార్కింగ్ వంటి వాటిలో మార్పులు జరిగాయి. ఈ రోజు నుంచి ఇవన్నీ అమల్లోకి వస్తాయి. అలాగే పోస్టల్ సర్వీసులలో మార్పులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల గడువును కూడా పెంచారు.

New Update
september

september

ప్రతీ నెల కొన్ని మార్పులు  జరిగినట్లు సెప్టెంబర్ నెలలో కూడా మార్పులు  జరిగాయి. వ్యక్తిగత పన్నులు, బ్యాంకింగ్, ప్రభుత్వ పథకాలు, ఇంధన ధరలు, క్రెడిట్ కార్డులు ఇలా అన్ని ఉన్నాయి. అయితే నేటి నుంచి మారనున్న ఆ రూల్స్ ఏంటో చూద్దాం. 

ఇది కూడా చూడండి: LPG Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే న్యూస్.. భారీగా తగ్గిన సిలిండర్ ధరలు!

ఆదాయపు పన్ను గడువు పెంపు

ఈ సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్‌లనుదాఖలు చేయడానికి చివరి తేదీని జూలై 30 నుంచి సెప్టెంబర్ 15కు పొడిగించారు. ఈ తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలి. లేకపోతే అధికారుల నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. 

నేషనల్ పెన్షన్ సిస్టమ్ గడువు పొడిగింపు

నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నమోదు చేసుకోవడానికి గడువు తేదీని పెంచారు. జూన్ 30 వరకు ఉన్న తేదీని సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. ఈ పథకం ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది.

పోస్టల్ సర్వీసులలో మార్పులు

నేటి నుంచి పోస్టల్ శాఖ దేశీయ పోస్టల్ సర్వీస్‌ను స్పీడ్ పోస్ట్ సర్వీస్‌తో విలీనం చేసింది. దీంతో ఇకపై సాధారణ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపిన ఏ డాక్యుమెంట్ అయినా కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా వెళ్తుంది. దీనివల్ల ఏ పోస్ట్ వెళ్లినా కూడా తొందరగా వెళ్తాయి. అయితే ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది. 

క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్లలో మార్పులు

నేటి నుంచి ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్ల ప్రోగ్రామ్‌లో మార్పులు చేసింది.  డిజిటల్ గేమింగ్ లేదా ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో చేసే లావాదేవీలపై ఇకపై రివార్డ్ పాయింట్లు లభించవు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులు తప్పకుండా వీటిని గుర్తించుకుని లావాదేవీలు చేయాలి. 

వెండికి హాల్‌మార్కింగ్ నిబంధనలు

నేటి నుంచి వెండి ఆభరణాలకు కూడా హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి. హాల్‌మార్కింగ్ ఉన్న ఆభరణాలు స్వచ్ఛతగా భావిస్తారు. వీటివల్ల వాటి క్వాలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తారు. 

ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల గడువు

ఇండియన్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ వంటి కొన్ని బ్యాంకుల ప్రత్యేక ఫిక్సిడ్ డిపాజిట్ పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి గడవు తేదీని పెంచింది. ఈ నెల 30 లోగా పెట్టుబడులు పెట్టాలి. అయితే ఈ పథకాల్లో అధిక వడ్డీ రేట్లు లభించే అవకాశం ఉంది. అందుకే చాలా మంది ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. 

గ్యాస్ ధరలు

ఈ నెలలో చమురు కంపెనీలు కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.51.50 తగ్గించింది. దీంతో  కమర్షియల్ సిలిండర్ ధర నేటి నుంచి రూ.1,580గా ఉంది. అయితే గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.

ఇది కూడా చూడండి: Business: 49, 99, 199, 299.. ధరలు ఇలానే ఎందుకు ఉంటాయో మీకు తెలుసా?

Advertisment
తాజా కథనాలు