Pushpa-2: పుష్ప–2 నిర్మాతలకు భారీ ఊరట–అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు

సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో పుష్ప–2 నిర్మాతలకు ఊరట లభించింది. నిర్మాతలు రవిశంకర్, నవీన్‌ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది.  దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులను కోర్టు జారీ చేసింది.

New Update
pushpa-2

Navin, Ravi shankar

పుష్ప–2 ప్రీమియర్ ష సందర్భంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోగా,  ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రగాయాలతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అరెస్ట్ చేయొద్దు...

ఈ కేసులో హీరో అల్లు అర్జున్, థియేటర్ ఓనర్లు, పుష్ప–2 నిర్మాతలు అందరి మీదా కేసులు నమోదయ్యాయి. అల్లు అర్జున్ ఇప్పటికే అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్ మీద విడుద​ల అయ్యారు. అయితే ఇందులో సినిమా నిర్మాతలు అయిన రవిశంకర్, నవీన్‌లకు మాత్ర భారీ ఊరట లభించింది. వీరిని అరెస్ట్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

Also Read: RJ:బోర్‌‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి

ఇక ఈ కేసులో తెలంగాణ సర్కార్‌కు బిగ్‌షాక్ తగిలింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. సంధ్య థియేటర్ దగ్గర లాఠీ ఛార్జి చేసిన పోలీసులపై చర్యలకు ఆదేశించింది. న్యాయవాది రామరావు దాఖలు చేసిన పిటిషన్‌పై NHRC విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్‌కు ఆదేశాలు జారీ చేసింది. రద్దీని నియంత్రించడంలో పోలీసులు ఫేయిల్ అయ్యారని NHRC రామారావు ఫిర్యాదు మేరకు తెలంగాణ సర్కార్ పై చర్యలకు సిద్ధమైంది. 

మరోవైపు సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమంగా మారింది. కొన్ని రోజులుగా ఆయన కోలుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆక్సిజన్ తీసిశామని.. సొంతంగా శ్వాస తీసుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. రెండు రోజులుగా మళ్లీ శ్రీతేజ్‌కు ఆక్సిజన్, వెంటిలేటర్ సపోర్ట్ అవసరం అయ్యిందని డాక్టర్లు చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడినట్లు వెల్లడిస్తున్నారు. నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్‌ ద్వారా ఫీడింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. న్యూరో సిస్టమ్‌లో ఎలాంటి స్పందన లేదని చెప్పారు. 

Also Read: USA: అమెరికా పిక్‌అప్ ట్రక్ విషాదం..ఉగ్రవాద చర్యేమోనని అనుమానం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు