Stock Market: నిన్న రాకెట్ స్పీడ్‌లా.. నేడు తాబేలులా.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

నిన్న రాకెట్ స్పీడ్‌లా దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నేడు సెన్సెక్స్ 547 పాయింట్ల నష్టంతో 81,887 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 24,760 వద్ద ట్రేడ్ అవుతుంది.

New Update
Stock Market Collapse

Stock Market

భారత్, పాక్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు రాకెట్‌లా దూసుకుపోయాయి. కానీ ఈ రోజు మాత్రం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నేడు సెన్సెక్స్ 547 పాయింట్ల నష్టంతో 81,887 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 24,760 వద్ద ట్రేడ్ అవుతుంది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: అణు బాంబు వేస్తామని పాక్ బెదిరిస్తే సహించం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

ఈ షేర్లు మాత్రమే లాభాల్లో..

దేశీయ స్టాక్ మార్కెట్‌లో ముఖ్యమైన షేర్లు అన్ని కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. సెన్సెక్స్ 30లో అయితే హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సన్‌‌ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, మారుతీ సుజుకీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ఇది కూడా చూడండి: IPL ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ రిలీజ్ చేసిన BCCI

ఇదిలా ఉండగా సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. భారత స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. భారత్‌, పాక్‌ కాల్పుల విమరణ ప్రభావం మార్కెట్‌ పై స్పష్టంగా కనపడింది. దీంతో మార్కెట్‌ 3.74% వృద్ధిని సాధించింది. ఇదే సమయంలో నిఫ్టీ 50 కూడా 872.9 పాయింట్లు లేదా 3.66% పెరిగి 24,830.75 వద్ద స్థిరపడింది. 

ఇది కూడా చూడండి: పాకిస్థాన్‌ కిరానా హిల్స్‌లో రహస్యం.. ఆర్మీ చేతికి చిక్కిన సమాచారం..!

ఈ భారీ లాభాలు దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో మదుపర్లకు దాదాపు రూ.16 లక్షల కోట్ల వరకు లాభాలు సొంతమయ్యాయి. బ్యాంకింగ్, ఐటీ, ఎనర్జీ, ఆటోమొబైల్ సెక్టర్లు లాభాల్లో కొనసాగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 6.2% పెరిగి సెన్సెక్స్ ర్యాలీకి సపోర్ట్ చేసింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 3.8% పెరిగి 55,200 స్థాయిని తాకింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు