Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. ఎన్నడూ లేనంత బోనస్‌!

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు పెర్ఫార్మెన్స్ బోనస్‌లను  ప్రకటించింది.  2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ కి  గాను ఈ బోనస్‌ను ప్రకటించింది.

New Update
Infosys

Infosys

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్(Infosys) తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు పెర్ఫార్మెన్స్ బోనస్‌లను  ప్రకటించింది.  2025-26 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ కి  గాను ఈ బోనస్‌ను ప్రకటించింది. అర్హులైన ఉద్యోగులకు 80 శాతం బోనస్ చెల్లించనున్నట్లు తెలిపింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఈసారి బోనస్ చాలా ఎక్కువగా ఉండడం ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపింది.

Also Read :  మందకొడిగా స్టాక్ మార్కెట్.. స్వల్ప నష్టాల్లో ప్రారంభం

80 శాతం బోనస్

అయితే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో కంపెనీ మంచి లాభాలను అర్జించడమే ఈ బోనస్ లకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గత మార్చి త్రైమాసికంలో చాలామంది ఉద్యోగులు తక్కువ బోనస్ అందుకున్నారు. కొందరికి 50% మాత్రమే రాగా, మరికొందరికి 70% వచ్చింది. కానీ ఈసారి కంపెనీ భారీగా బోనస్ లు ప్రకటించింది. ఈ మేరకు అర్హులైన ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపుతోంది కంపెనీ. 

బోనస్ పంపిణీ  కంపెనీలో మెజారిటీ ఉద్యోగులు కలిగిన లెవెల్  4, 5 అండ్  6 స్థాయిల్లోని ఉద్యోగులను  కవర్ చేసేలా ప్లాన్ చేశారు. ఇందులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నుంచి  టీమ్ లీడర్లు, సీనియర్ మేనేజర్లు ఉంటారు. 

అలాగే బోనస్ కోసం  సిబ్బందిని మూడు పనితీరు వర్గాలుగా విభజించారు ..  'అత్యుత్తమ', 'ప్రశంసనీయ',  'అంచనాలను అందుకున్న'. వీటి ఆధారంగా బోనస్ పర్సెంటేజ్ ఆధారపడి ఉంటుంది. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు 89% వరకు బోనస్ చెల్లించనున్నారు. ప్రశంసనీయ' స్థాయిలో ఉన్నవారికి 80 శాతం, అంచనాలు అందుకున్నవారికి 80- 75 శాతం వరకు బోనస్ చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఈ బోనస్‌(Bonus) ను ఆగస్టు నెల జీతంతో కలిపి ఇస్తారు. ఉత్తమ పనితీరును ప్రోత్సహించాలనే లక్ష్యంతో బోనస్ చెల్లింపులు జరుగుతున్నట్లు సంస్థ పేర్కొంది.

Also Read:ఫుల్ జోష్‌లో దేశీ స్టాక్ మార్కెట్లు.. 1000 పాయింట్లకుపైగా లాభం

Advertisment
తాజా కథనాలు