Online Shopping: అలెర్ట్.. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో మోసాలు

పండుగ సీజన్‌ వచ్చేసింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌లో భారీగా ఆఫర్లు రానున్నాయి.అయితే సేల్స్‌ సమయంలో జాగ్రత్తలు పాటించాలని మొబైల్ తయారీ కంపెనీలు కస్టమర్లకు సూచిస్తున్నాయి. లేకపోతే సెల్లర్ల వద్ద ఫేక్‌ వస్తువులను కొనుక్కొని మోసపోతారని హెచ్చరిస్తున్నాయి.

New Update
Samsung and Realme released online market place sellers list to save from online frauds

Samsung and Realme released online market place sellers list to save from online frauds


మరికొన్ని రోజుల్లో దసరా , దీపావళి పండుగలు రానున్నాయి. దీంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌లో భారీగా ఆఫర్లు రానున్నాయి. మొబైల్ ఫోన్లు, టీవీలు లాంటి తదితర ఎలక్ట్రానిక్స్ వస్తువులు డిస్కౌంట్‌లో వస్తుంటాయి. చాలామంది తక్కువ ధరల కోసమని వాళ్లకి కావాల్సిన వస్తువులు ఆర్డర్‌ పెట్టుకుంటారు. అయితే సేల్స్‌ సమయంలో జాగ్రత్తలు పాటించాలని మొబైల్ తయారీ కంపెనీలు కస్టమర్లకు సూచిస్తున్నాయి. లేకపోతే సెల్లర్ల వద్ద ఫేక్‌ వస్తువులను కొనుక్కొని మోసపోతారని హెచ్చరిస్తున్నాయి. 

Also Read: మేనల్లుడితో అత్త అక్రమ సంబంధం..  భర్తను చంపి ఇంటి వెనకాల పాతిపెట్టిన భార్య

అమెరికా, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో సెలెక్ట్‌ చేసిన సెల్లర్ల నుంచే కొనాలని శాంసంగ్ సూచనలు చేసింది. దీనికి సంబంధించి ఓ లిస్టును విడుదల చేసింది. అనధికారిక సెల్లర్ల నుంచి కొనే మొబైళ్లు, ఇతర వస్తువులు అనేవి రిఫర్బిష్డ్, ప్రీయూజ్డ్‌, యాక్టివేటెడ్, ఫేక్ ఉత్పత్తులు కూడా కావొచ్చని తెలిపింది. ఇలాంటి ఉత్పత్తులకు వారెంటీ అనేది పూర్తిగా లేదా పరిమితంగానే ఉండొచ్చని చెబుతోంది.     

Also Read: నేపాల్ సంచలన నిర్ణయం.. సోషల్ మీడియా యాప్స్‌పై నిషేధం ఎత్తివేత

షావోమీ, రియల్‌మీ సైతం ఇలానే ప్రకటనే చేశాయి. అధికారిక సెల్లర్ల జాబితాను కూడా ప్రకటించాయి. లేకపోతే తమ అధికారిక వెబ్‌సైట్‌, రిటైల్‌ సంస్థల నుంచి కొనాలని సూచనలు చేస్తున్నాయి. శాంసంగ్ విడుదల చేసిన డేటా ప్రకారం.. అమెజాన్‌లో STPL ఎక్స్‌క్లూజివ్‌, క్లిక్‌టెక్‌ రిటైల్‌, దర్షిత ఈటెల్‌ సెల్లర్ల నుంచి మొబైల్స్‌ కొనుగోలు చేయాలి. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో చూసుకుంటే ట్రూకామ్ రిటైల్, మైథన్‌గ్లోరీ రిటైల్, ఫ్లాష్‌స్టార్‌ కామర్స్, బీటీపీఎల్‌డీ లాంటి సెల్లర్లను ఎంపిక చేసుకోవాలి.

Also Read: నవారో నోటికి హద్దే లేకుండా పోతోంది..భారత్ కు మంచి ముగింపు లేదంటూ మరోసారి..

షావోమీ స్మార్ట్‌ఫోన్‌లు కొనేటప్పుడు అమెజాన్‌లో అయితే గ్రీన్‌ మొబైల్స్‌, గ్రీన్‌ మొబైల్స్, ఫ్లిప్‌కార్ట్‌లో చూసుకుంటే మైథన్‌గ్లోరీ, అక్షనవ్‌ లాంటి సెల్లర్లను మాత్రమే సెలెక్ట్‌ చేసుకోవాలి. అయితే అమెజాన్‌లో దర్షిత ఈటెల్‌ ఒక్కటే తమ అధికార సెల్లర్ అని రియల్‌మీ తెలిపింది. ఇక ఫ్లిఫ్‌కార్ట్‌లో Patpritrade, Supercom, TAMS, Clientero, Sthenios Ecommerce, Grahgoods లాంటి సెల్లర్ల నుంచి కూడా కొనుగోలు చేయాలని రియల్‌మీ వెల్లడించింది. 

Also Read: కొన్ని రోజులు మాత్రమే సమయం.. ఐటీఆర్ ఫైల్ చేయకపోతే జరిమానా తప్పదు!

Advertisment
తాజా కథనాలు