ITR: కొన్ని రోజులు మాత్రమే సమయం.. ఐటీఆర్ ఫైల్ చేయకపోతే జరిమానా తప్పదు!

ఆదాయం వచ్చే వారు తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేయాలి. లేకపోతే సెక్షన్ 234F కింద జరిమానా విధిస్తారు. అయితే ఐటీఆర్ ఫైల్ చేయడానికి సెప్టెంబర్ 15 చివరి తేదీ. సమయానికి ఫైల్ చేయకపోతే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావచ్చని నిపుణులు అంటున్నారు.

New Update
ITR

ITR

ఆదాయం వచ్చే వారు తప్పకుండా ఐటీఆర్ ఫైల్ చేయాలి. లేకపోతే సెక్షన్ 234F కింద జరిమానా విధిస్తారు. అయితే ఐటీఆర్ ఫైల్ చేయడానికి సెప్టెంబర్ 15 చివరి తేదీ. ఈ తేదీలోగా చేయకపోతే ఆలస్యంగా ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు దాఖలు చేయవచ్చు. కాకపోతే దీనికి జరిమానా విధిస్తారు. ఉదాహరణకు మీకు రూ.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి రూ.5 వేలు జరిమానా విధిస్తారు. దీని కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి రూ.1000 జరిమానా పడుతుంది. అయితే గడువు తేదీలోగా ఐటీఆర్ ఫైల్ చేస్తేనే డబ్బులు వస్తాయి.

ఇది కూడా చూడండి:  Iphone 16 Pro Price Drop: ఐఫోన్ 16 ప్రో పై బుర్రపాడు ఆఫర్ మావా.. మిస్ అయితే మళ్లీ రాదు!

అదే ఆలస్యంగా ఫైల్ చేస్తే రావాల్సిన ఆదాయపు పన్ను రిఫండ్ కూడా లేట్‌గా వస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే ఎక్కువ పన్ను వారి కంటే తక్కువ పన్ను వారికి రిఫండ్ త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గడువు తేదీ పూర్తి కాకుండా ముందే అప్లై చేసుకోవడం మంచిది. కొన్ని సార్లు సమయానికి ఐటీఆర్ ఫైల్ చేయకపోతే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావచ్చు. ఒకవేళ నోటీసులు వస్తే మాత్రం తప్పకుండా కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాల్సి వస్తుంది. ఇది మీ లోన్‌పై  కూడా ప్రభావం చూపుతుంది. మీరు బ్యాంకుకు వెళ్లి లోన్ లేదా క్రెడిట్ కార్డు ఏదైనా కావాలంటే వెంటనే రాదని నిపుణులు అంటున్నారు. లోన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదంటే మాత్రం సమయానికి ఐటీఆర్ దాఖలు చేసుకోవడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. 

ఎలా ఫైల్ చేయాలంటే?

ఐటీఆర్ ఫైల్ చేయాలంటే www.incometax.gov.in అనే ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ కావాలి. ఆ తర్వాత పాన్, ఆధార్ వివరాలను నమోదు చేయాలి. ఇలా చేసిన తర్వాత మీ ఆదాయం బట్టి ఫారమ్‌ను ఎంచుకోవాలి. జీతం, వడ్డీ, ఇతర ఆదాయం వంటి వివరాలను నమోదు చేసుకోవాలి. అలాగే చెల్లించిన పన్ను, మినహాయింపులను నమోదు చేసుకుని ఒకసారిగా చివరకు చెక్ చేసుకోవాలి. ఇక ఐటీఆర్-Vని డౌన్‌లోడ్ చేసి ఈ-వెరిఫై చేసుకోవాలి. ఇది 100 శాతం పూర్తి అయితే ఫైల్ పూర్తి అయినట్లు. ఇలా అప్లై చేసుకున్న కొన్ని రోజులకు మీ అకౌంట్‌లో డబ్బులు జమ అవుతాయి.

ఇది కూడా చూడండి: Mobile Offer: నమ్మరేంట్రా బాబు.. రూ.2వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్ - పరుగో పరుగు!

Advertisment
తాజా కథనాలు