Illegal Relationship: మేనల్లుడితో అత్త అక్రమ సంబంధం..  భర్తను చంపి ఇంటి వెనకాల పాతిపెట్టిన భార్య

20ఏళ్ల మేనల్లుడితో 45ఏళ్ల అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను గట్టిగా మందలించాడు. దీంతో భర్త అచూకీ లేకుండా చేయాలని మేనల్లుడితో స్కెచ్ వేసి అతన్ని చంపి ఇంటి వెనకాల పాతిపెట్టింది భార్య.

New Update
kanpur

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh) కాన్పూర్‌లో మరో ఘోరం జరిగింది. 20ఏళ్ల మేనల్లుడితో 45ఏళ్ల అత్త వివాహేతర సంబంధం(illegal-relationship) పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను గట్టిగా మందలించాడు. దీంతో భర్త అచూకీ లేకుండా చేయాలని మేనల్లుడితో స్కెచ్ వేసి అతన్ని చంపి ఇంటి వెనకాల పాతిపెట్టింది భార్య. దాదాపు పదినెలల తరువాత ఈ వ్యవహారం భయటపడింది. తాజాగా ఆ శవాన్ని పోలీసులు బయటకు తీశారు. సచేండిలోని లాలూపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 

 శివవీర్‌ సింగ్(50), లక్షి(45) దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. మేనల్లుడు అమిత్‌సింగ్‌(20)తో లక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని అతని హత్యకు అల్లుడితో కలిసి స్కెచ్ వేసింది లక్ష్మి.  టీలో మత్తుమందు కలిపి ఇచ్చింది. ఆ తరువాత బతికే ఉంటాడాన్న అనుమానంతో ఇనుపరాడ్డుతో కొట్టి కొట్టి హత్యకు పాల్పడింది. అనంతరం భర్త శవాన్ని ఇంటి వెనకాలే గొయ్యి తవ్వి ప్రియుడి సహయంతో పాతిపెట్టి్ంది. త్వరగా  శవం కుళ్లిపోయేలా గొయ్యిలో 10 కిలోల ఉప్పు పోసింది. 

గుజరాత్ వెళ్లాడని నమ్మంచి

శివవీర్‌ సింగ్ కనిపించకుండా పోవడంతో పనికోసం గుజరాత్ వెళ్లాడని పొరుగువారిని, కుటుంబ సభ్యులను నమ్మించింది. అయితే చాలాకాలంగా అతను కనిపించకుండా పోవడం, అతని ఫోన్ కలవకపోవడం వంటివి కుటుంబ సభ్యులకు అనుమానాలు కలిగించాయి. దీంతో అతని తల్లి సావిత్రి దేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో లక్ష్మి మేనల్లుడు అమిత్ సింగ్‌తో ఆమెకు సంబంధం ఉందని తెలుసుకున్న పోలీసులు వారిని తమదైన శైలిలో విచారించగా తామే ఈ నేరం చేసినట్లుగా అంగీకరించారు. బాధితుడి వ్యక్తిగత వస్తువులు చొక్కా, లాకెట్‌ ద్వారా అతన్ని గుర్తించామని అదనపు డీసీపీ తెలిపారు.ఇంటి వెనుక ప్రాంగణంలో అస్థిపంజర అవశేషాలు లభ్యం అయ్యాయి. సెప్టెంబర్ 7న లక్ష్మి, అమిత్‌లను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Also read :  Moradabad : 15 రోజుల శిశువును ఫ్రీజర్‌లో పెట్టి మర్చిపోయిన తల్లి.. చివరకు ఏమైందంటే?

Advertisment
తాజా కథనాలు