Mobile Data Saver Setting: మొబైల్ డేటా త్వరగా అయిపోతుందా?.. అయితే ఇలా చేయండి!

మీ మొబైల్ డేటా త్వరగా అయిపోతుంటే కొన్ని సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది. మొబైల్ సెట్టింగ్‌లో డేటా సేవర్ ఆప్షన్‌ ఆన్ చేసుకోవాలి. అలాగే మొబైల్ డేటా యూసేజ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అక్కడ మీరు ఉపయోగిస్తున్న అప్లికేషన్లలో బ్యాక్ గ్రౌండ్ డేటా ఆఫ్ చేసుకోవాలి.

New Update
mobile internet data saver setting in telugu

mobile internet data saver setting in telugu

Mobile Data Saver Setting: ఛా.. మొబైల్ వాడకపోయినా డేటా ఇలా అయిపోతుందేంటి?.. కనీసం ఒక్క వీడియో కూడా చూడలేదు. ఉదయం లేవగానే ఇలా మొబైల్ ఆన్ చేశాను.. ఇంతలోనే 90% డేటా అయిపోయిందని మెసేజ్ వచ్చింది. ఏం చేయాలి అబ్బా.. డేటా సేవ్ చేసుకోవాలంటే ఏ సెట్టింగ్ ఆఫ్ చేయాలి.. ఏ సెట్టింగ్ ఆన్ చేయాలో కూడా తెలియడం లేదే. పోనీ వన్ డే డేటా బ్యాలెన్స్ వేసుకుందామా అంటే.. అది కూడా త్వరగానే అయిపోతుందనే భయం. అలాంటి వారికి గుడ్ న్యూస్. ఇక నుంచి డేటా త్వరగా అయిపోతుందని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకోసం అదిరిపోయే సెట్టింగ్‌ను తీసుకొచ్చాం. ఒకటి రెండు సెట్టింగ్‌లు చేస్తే మీ డేటా రోజు మొత్తం వాడుకోవచ్చు. అవును మీరు విన్నది నిజమే.. ఎంత డేటా వాడినా రోజులో ఇంకా మిగిలే ఉంటుంది. ఇప్పుడు ఆ డేటా సేవ్ సెట్టింగ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. 

Also Read:మజాకా రివ్యూ.. సందీప్‌ కిషన్‌ ఖాతాలో హిట్‌ పడిందా?

mobile data saver setting

మీరు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నట్లయితే ముందుగా మీ స్క్రీన్‌ను అన్ లాక్ చేసుకోవాలి. సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆపై కనెక్షన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. అనంతరం అక్కడ చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. అవన్నీ కాకుండా మనకు కావాల్సిన ఆప్షన్‌ను చూడాలి. అక్కడ డేటా యూసేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై ప్రెస్ చేస్తే అందులో కూడా మరిన్ని ఉంటాయి. 

Also Read:మరోసారి భారీ భూకంపం.. 6.1 తీవ్రత నమోదు- ఎక్కడంటే?

‘డేటా సేవర్’

మొదటి ఆప్షన్‌గా మీరు ‘డేటా సేవర్’ అనే దానిపై క్లిక్ చేయాలి. ఆ ఆప్షన్ ఆఫ్‌లో ఉంటుంది. మీరు దాన్ని ఆన్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా డేటాను సేవ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ అందరికీ తెలుసులే మీరే చెప్పాలా? అనే ప్రశ్న మీలో మెదలొచ్చు. ఆగండి ఆగండి అక్కడకే వస్తున్నాం. ఈ ఒక్క సెట్టింగ్ మాత్రమే కాదండోయ్.. ఇంకో సెట్టింగ్ కూడా ఉంది. అదే అసలు సిసలైన సెట్టింగ్. 

Also Read:బాలింతలు, గర్భిణులే టార్గెట్.. రూ.4 కోట్ల టోకరా-పట్టుబడ్డ ఏపీ సైబర్ స్కామర్స్!

‘మొబైల్ డేటా యూసేజ్’

ఈ డేటా సేవర్ సెట్టింగ్ తర్వాత మళ్లీ బ్యాక్‌కు వచ్చేసి.. అక్కడే ‘మొబైల్ డేటా యూసేజ్’ అనే మరో ఆప్షన్ ఉంటుంది. దానిపై ప్రెస్ చేయాలి. అక్కడ మీకు కొన్ని అప్లికేషన్లు కనిపిస్తాయి. ఏ అప్లికేషన్ ఎక్కువ, ఏది తక్కువ ఇంటర్నెట్ ఉపయోగించుకుంటుందో అక్కడ చూపిస్తుంది. మీరు ఏది అయితే తరచూ ఉపయోగిస్తున్నారో.. అక్కడ ఎక్కువగా డేటా యూజ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. 

‘అలౌ బ్యాక్ గ్రౌండ్ డేటా యూసేజ్’

దీంతో మీరు ఆ అప్లికేషన్‌పై క్లిక్ చేస్తే ‘అలౌ బ్యాక్ గ్రౌండ్ డేటా యూసేజ్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అంటే.. మీ మొబైల్‌లో మీరు ఆ అప్లికేషన్ ఓపెన్ చేయకపోయినా.. బ్యాక్ గ్రౌండ్‌లో డేటాను యూజ్ చేసుకునేలా అక్కడ పర్మిషన్ ఇచ్చా ఉంటుంది. అందువల్ల మీరు డేటా వాడకపోయినా.. తానంతన అదే డేటాను వాడేసుకుంటుంది. దీని కారణంగా మీ డేటా తొందరగా అయిపోతుంది. 

అందువల్ల దాన్ని ఆఫ్ చేసేయాలి. దీనివల్ల మీరు ఎప్పుడైతే ఆ అప్లికేషన్ ఓపెన్ చేస్తారో అప్పుడు మాత్రమే డేటా యూజ్ చేసుకుంటుంది. మిగతా సమయాల్లో డేటా అనేది అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా మిగతా అప్లికేషన్లలో కూడా బ్యాక్ గ్రౌండ్ డేటా ఆఫ్ చేస్తే సరిపోతుంది. మీ డేటా మొత్తం సేవ్ అవుతుంది. 

Advertisment
తాజా కథనాలు