New Update
/rtv/media/media_files/2025/02/07/Gu5udhAGjWKt2N4Guxya.jpg)
jio cheapest recharge plans announce
దేశంలోని ప్రసిద్ధ టెలికాం సంస్థ రిలయన్స్ జియో అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తుంది. ఓ వైపు తక్కువ ధరకే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది. మరోవైపు మరింత మంది యూజర్లను రప్పించుకునేందుకు తరచూ ఏదో ఒక అదిరిపోయే ప్లాన్‌లను తీసుకొస్తుంది. తాజాగా జియో మరో గుడ్ న్యూస్ అందించింది. రెండు కొత్త ప్లాన్‌లను అందిస్తుంది. అవి 365 రోజుల వ్యాలిడిటీ, 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చాయి.
Also Read : ఆల్కహాల్ బ్రాండ్ కి బాలయ్య యాడ్.. పద్మ భూషణ్ తిరిగి ఇవ్వాలంటూ నెటిజన్ల ట్రోలింగ్! వీడియో వైరల్
365 రోజుల వ్యాలిడిటీ
రూ. 1958లతో రీఛార్జ్ చేసుకుంటే కంపెనీ 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఇందులో డేటా ప్రయోజనం లేదు. కానీ అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. మొత్తం 3600 SMSల సౌకర్యం పొందవచ్చు. అయితే మీరు 1 సంవత్సరం వ్యాలిడిటీతో డేటా బెనిఫిట్ ప్లాన్ కోరుకుంటే.. రూ.3,599 ఖర్చు చేయాలి. ఈ ప్లాన్‌లో మీరు ప్రతిరోజూ 2.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMSల సౌకర్యాన్ని పొందుతారు. జియో యాప్‌ల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది.
Also Read : ఐస్ క్రీంలో బల్లి తోక.. కట్ చేస్తే రూ.50,000 ఫైన్ - వీడియో చూశారంటే?
84 రోజుల వ్యాలిడిటీ
రూ.458 లతో రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. 1000 SMS లను లభిస్తాయి. ఇది మాత్రమే కాకుండా.. వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పూర్తిగా ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్ తో పాటు నేషనల్ రోమింగ్ సౌకర్యం కూడా ఉచితంగా లభిస్తుంది. ఇందులో కూడా డేటా లభించదు. ఒకవేళ డేటా కావాలనుకుంటే.. రూ. 799 ఖర్చు చేయాలి. అప్పుడు 84 రోజుల పాటు అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 100 SMSలు, రోజుకు 1.5GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. అలాగే జియో టీవీ, జియో క్లౌడ్ లకు యాక్సెస్ కూడా ఉచితంగా లభిస్తుంది.
Also Read : నవంబర్‌లో కుప్పకూలనున్న మోదీ సర్కార్.. ?
jio recharge offers | jio-recharge-plan | latest-telugu-news | telugu-news
Also Read : హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!
తాజా కథనాలు