/rtv/media/media_files/2025/01/23/BN8PevJdKwVUfDmsl8Ad.jpg)
jio recharge plans Photograph: (jio recharge plans)
Jio new recharge plans: రిలయన్స్ జియో టెలికాం సంస్థ రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ తొలగించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నీ నెట్‌వర్క్ కంపెనీలను కేవలం వాయిస్, SMS రిచార్జ్ ప్లాన్స్ వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. దీంతో జియో కంపెనీ రెండు కొత్త టారిఫ్ రిఛార్జ్ సర్వీసులు ప్రారంభించింది. ఈక్రమంలో మరో రెండు ప్రీ పెయిడ్ రీఛార్జ్ సర్వీసులను జియో తొలగించింది కూడా.
ఇది కూడా చదవండి : మహిళా సమ్మాన్ స్కీమ్.. బడ్జెట్‌లో గడువు పెంచుతారా?
ఇప్పటి వరకు అందిస్తున్న రూ.189, రూ.479 రీఛార్జ్‌లను జియో నెట్ వెబ్‌సైట్ నుంచి తీసేసింది. తక్కువ డేటా, ఎక్కువ రోజుల వ్యాలిడిటతో రెండు కొత్త ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది. రెండు సిమ్ కార్డ్ నెట్‌వర్స్ వాడుతున్న వారికి ఇది గుడ్‌న్యూస్. ఒక నెట్‌వర్క్ అన్‌లిమిటెట్ రీఛార్జ్ చేసి, మరోటి తక్కువ డేటాతో ఎక్కువ రోజులు ఇన్‌కమింగ్ కాల్స్ వచ్చే రీచార్జ్ చేయించుకోవచ్చు. ఇలాంటి ప్లాన్స్ త్వరలోనే అన్నీ నెట్‌కర్క్ కంపెనీలు తీసుకురావాలని ట్రాయ్ ఆదేశించింది. ఈ క్రమంలోనే జియో ముందుగా రీఛార్జ్ ప్లాన్స్ పరిచయం చేసింది.
రూ.458 రీఛార్జ్‌తో 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్, రూ.1958 లో 365 రోజుల వ్యాలిడిటీతో మరో ప్లాన్ జియో అందుబాటులోకి తీసుకోచ్చింది. ఇదిలా ఉండగా.. జియో ఇప్పుడు పాత రీఛార్జ్ ప్లాన్‌లను జాబితా నుంచి తొలగించింది. రూ.479, రూ.1899.. రూ.1899 ప్లాన్ 336 రోజుల చెల్లుబాటుతో 24GB డేటాను అందించనుండగా.. రూ.479 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో 6జీబీ డేటాను ఈ ప్లాన్ అందించింది.
ఇది కూడా చూడండి: USA: గడ్డకట్టే చలిలో నీళ్ళల్లో పడి బతకడం కష్టమే..ఇప్పటికి 18మంది మృతి