TRAI: 2.75 లక్షల నంబర్లు కట్..స్పామ్ కాల్స్ మీద చర్యలు
స్పామ్ కాల్స్ విషయంలో ట్రాయ్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికి 2.75 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్ చేసింది. మరో 50 సంస్థలను ఈ లిస్ట్‌లో చేర్చేందుకు రెడీ అవుతోంది.
స్పామ్ కాల్స్ విషయంలో ట్రాయ్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికి 2.75 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్ చేసింది. మరో 50 సంస్థలను ఈ లిస్ట్‌లో చేర్చేందుకు రెడీ అవుతోంది.
ఈ మధ్య కాలంలో స్పామ్ కాల్స్, ఫోన్లలో సైబర్ క్రైమ్‌లు బాగా ఎక్కువ అయిపోతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త రూల్‌ను ప్రవేశపెట్టింది. దీంతో అక్రమార్కుల ఆట కట్ అని చెబుతోంది. అవేంటో కింద చదివేయండి.
జిల్లా స్థాయిలో నెట్వర్క్ అంతరాయం కలిగితే పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అద్దెపై రిబేటు ఇవ్వాలని టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ చెప్పింది. టెలికాం కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సిన కొత్త నిబంధనలను ట్రాయ్ విడుదల చేసింది. ఈ నిబంధనలు పాటించని కంపెనీలకు జరిమానా వేయనున్నట్లు తెలిపింది.
కాల్, డేటా, SMS సేవల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్లను రూపొందించాలని టెలికాం కంపెనీలకు TRAI ఆదేశాలు జారీ చేసింది. చాలా మంది నాన్-స్మార్ట్‌ఫోన్ సబ్స్క్రైబర్లు తాము ఉపయోగించని డేటా సేవలకు కూడా ఛార్జీ విధిస్తున్నట్టు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ట్రాయ్ ఈ చర్యలు తీసుకోనుంది.
మొబైల్ కస్టమర్ల కోసం TRAI ఒక సమాచారాన్ని విడుదల చేసింది.ట్రూ కాలర్ ఉపయోగించకుండానే కాలర్ పేరు తెలుసుకునే ఫీచర్ ను ట్రాయ్ ప్రవేశపెట్టనుంది. కొత్త నంబర్ నుంచి కాల్ చేసిన వారి పేరు తెలుసుకునేందుకు ప్రత్యేక సదుపాయాన్ని ప్రవేశపెడుతున్నట్లు ట్రాయ్ తెలిపింది.
ట్రూ కాలర్‌ను ఉపయోగించకుండానే మనకు ఫోన్ చేసిన వారి పేరును తెలుసుకునే సదుపాయాన్ని ట్రాయ్ అందుబాటులోకి తేనుంది. నేమ్ ప్రజెంటేషన్ సర్వీస్‌ను ఈ నెల 15వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభించనుంది. సిమ్ కార్డు కొన్నప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కాలర్ల పేర్లు ఫోన్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
జూలై 1 నుంచి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP)లో కొత్త నిబంధనలను అమలు చేయాలని TRAI నిర్ణయించింది. సిమ్‌ను పోర్ట్ చేయాలనుకుంటే, మొదట దరఖాస్తును సమర్పించాలి, ఆపై కొంత సమయం వేచి ఉండాలి.
ఫోన్ నంబర్ కావాలంటే ఇక మీదట డబ్బులు చెల్లించాల్సిందే అంటోంది ట్రాయ్. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపించింది. ఫోన్ నంబర్ల దుర్వినియోగం అరికట్టేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్టు ట్రాయ్ చెబుతోంది.