Stock Market: పెరిగిన జీడీపీ..లాభాల్లో స్టాక్ మార్కెట్ పరుగులు

ఈరోజు భారత స్టాక్ మార్కెట్ లాభాల్లో పరుగులు పెడుతోంది.  దేశ జీడీపీ గణాంకాలు అంచనాలకు మించి నమోదవడంతో స్టాక్ వాల్యూ పెరుగుతోంది. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 80,700 వద్ద.. నిఫ్టీ కూడా 100 పాయింట్లు పెరిగి 24,700 వద్ద ట్రేడవుతోంది.

New Update
business

Stocks

ట్రంప్ టారిఫ్ లతో దెబ్బతో కుదేలయిన స్టాక్ మార్కెట్ నెమ్మదిగా కోలుకుంటోంది. చైనా, రష్యాలతో కొత్త ఒప్పందాలు మదుపర్లులలో కొత్త ధైర్యాన్ని నింపుతోంది. దానికి తోడు మొదటి త్రై మానసికంలో దేశ జీడీపీ అంచనాలకు మించి పెరగడం కూడా మార్కెట్ కు సానుకూలంగా మారింది. దీంతో సూచీలు లాభాల్లో పరుగులు తీస్తున్నాయి. అలాగే మార్కెట్ అస్థిరతను సూచించే వీఐఎక్స్‌ ఇండెక్స్ నాలుగు శాతానికి పడిపోవడం మార్కెట్ స్థిరత్వాన్ని సూచిస్తోంది. దీంతో ఈరోజు సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగి 80,700 దగ్గర ఉండగా.. నిఫ్టీ కూడా 100 పాయింట్లు పెరిగి 24,700 వద్ద ట్రేడవుతోంది.

దాదాపు 25 షేర్లు లాభాల్లో..

సెన్సెక్స్‌లోని 30 స్టాక్‌లలో 25 లాభపడగా, 5 నష్టపోయాయి. జొమాటో, రిలయన్స్, అదానీ పోర్ట్స్ లాభపడ్డాయి.  అలాగే రిలయన్స్, ఎన్‌టీపీసీ, కోల్ ఇండియా, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు కూడా లాభాల్లో ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, హిందాల్కో, ట్రెంట్‌, సిప్లా షేర్లతో పాటూ ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా షేర్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు 50 నిఫ్టీ సూచీలలో 32 లాభపడ్డాయి, 18 నష్టపోయాయి. NSE రియాల్టీ, మీడియా, ఆయిల్ & గ్యాస్ సూచీలు లాభాలతో ట్రేడవుతున్నాయి. ఆటో, ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ జీవనకాల కనిష్ఠమైన 88.16 దగ్గర ఉంది. ఇక సెప్టెంబర్ 1న విదేశీ పెట్టుబడిదారులు (FIIలు) నగదు విభాగంలో రూ.1,429.71 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో, దేశీయ పెట్టుబడిదారులు (DIIలు) రూ.4,344.93 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు.

మిశ్రమంగా అంతర్జాతీయ మార్కెట్...

భారత మార్కెట్ జోరు మీదుంటే అంతర్జాతీయ మార్కెట్ మాత్రం మధ్యస్థంగా ఉంది. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 0.25% పెరిగి 42,292 వద్ద, కొరియా కోస్పి 0.66% పెరిగి 3,163 వద్ద ముగిశాయి. అలాగే హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.082% తగ్గి 25,596 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.91% తగ్గి 3,876 వద్ద ముగిశాయి. ఇక అమెరికా స్టాక్ మార్కెట్ల విషయానికి వస్తే..ఆగస్టు 29న, US డౌ జోన్స్ 0.20% తగ్గి 45,545 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 1.15% మరియు S&P 500 0.64% పడిపోయాయి. 

Also Read:  India-Russia Agreement: భారత్ లో రష్యా యుద్ధ విమానాలు..పాక్ కు ఇక మూడినట్టే..

Advertisment
తాజా కథనాలు