/rtv/media/media_files/2026/01/18/it-employees-2026-01-18-17-35-19.jpg)
IT Employees
గత కొంతకాలంగా టెక్ రంగంలో లేఆఫ్‌లు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏఐ రాకతో ఖర్చులు తగ్గించుకోవడం కోసం బడా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం టెక్ రంగంలో నియామకాలు పెరగనున్నాయి. 2025తో పోలిస్తే ఈ ఏడాది 12 నుంచి 15 శాతం పెరిగే ఛాన్స్ ఉందని వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా తెలిపింది. శాశ్వత, తాత్కాలిక , కాంట్రాక్టు ఆధారంగా జరిగే ఈ నియామకాల(IT Jobs) ద్వారా దాదాపు 1.25 లక్షల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని వెల్లడించింది.
Also Read: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
అనేక కంపెనీలు ఇప్పుడు తమ బిజినెస్‌లో కూడా కీలక మార్పులు చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా ఇంజినీరింగ్, సైబర్ సెక్యూరిటీ లాంటి విభాగాలను తమ వ్యాపారాల్లో వినియోగిస్తున్నాయి. దీనివల్ల 2026లో టెక్ నియామకాలు(hiring) పెరగనున్నట్లు అడెకో ఇండియా వివరించింది. దీని గురించి ఆ సంస్థ డైరెక్టర్, బిజినెస్ హెడ్ సంకేత్ మాట్లాడారు. 2023-24 మధ్య నెలకొన్న అనిశ్చితి తర్వాత ఏఐ ఇంజినీరింగ్,సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్, డేటా ప్లాట్‌ఫామ్స్ ఆధునికీకరణ లాంటి విభాగాల్లో డిమాండ్ పెరుగుతూ వచ్చిందని తెలిపారు. కంపెనీలు క్రమంగా పునరుద్ధరణ దిశగా సాగుతున్నాయని తెలిపారు. మళ్లీ కొత్త ఉద్యోగుల కోసం కావాల్సిన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నాయని చెప్పారు.
51 శాతం పెరిగిన డిమాండ్
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా, సైబర్ సెక్యూరిటీ లాంటి సాంకేతికతలు కంపెనీలకు ప్రధాన అవసరాలుగా మారిపోయాయి. ఈ విభాగాల్లో 51 శాతం డిమాండ్ పెరిగినట్లు అడెకో ఇండియా తెలిపింది. దాదాపు 40 శాతం పెద్ద సంస్థలు జనరేటివ్ ఏఐ ప్రాజెక్టులను కార్యరూపంలోకి తీసుకొచ్చాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (JCC) సైబర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. టెక్ ఏతర రంగాలు ఆటోమేషన్‌ను వేగం చేసేందుకు భారీగా టెక్ సిబ్బందిని నియమించుకుంటున్నాయి. - it-employees
Also Read: మచాదోకు రెడ్ బ్యాగ్ గిఫ్ట్ ఇచ్చిన ట్రంప్..అందులో ఏముందో తెలుసా!?
ఓవైపు ఉద్యోగాలు పెరుగుతున్నప్పటికీ మరోవైపు కంపెనీకి అవసరమైన నిపుణల కొరత ఉంటోంది. 2-025 నాటికి స్కిల్స్ లోటు 44 శాతానికి చేరింది. దీంతో స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు పోటీ పెరిగింది. వేతన ప్యాకేజీలు 2024తో పోల్చి చూస్తే సగటున 18 శాతం అధికంగా ఉంటున్నాయి. ఇక ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ లాంటి విభాగాల్లో 45 శాతం నైపుణ్య లోటు ఉంది. టెక్ ఆధారిత నియామకాలు బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా, లాజిస్టిక్స్, ఆరోగ్య సంరక్షణ, తయారీ రంగాల్లో పెరగనున్నాయి. టెక్ ఉద్యోగాల్లో ఈ రంగాల వాటా 38 శాతం ఉన్నట్లు అడెకో ఇండియా వెల్లడించింది.
Follow Us