Karnataka : ఐటీ ఉద్యోగులకు షాక్.. రోజుకు 14 గంటలు పని !
కర్ణాటకలో ఐటీ సంస్థలు.. ఉద్యోగుల పనివేళలు 14 గంటలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ఐటీ ఉద్యోగులు దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఇలాచేస్తే తమకు ఆరోగ్య సమస్యలు వస్తాయని వాపోతున్నారు.