/rtv/media/media_files/2025/03/10/nyBqceWCmCpVwIS3wB1x.jpg)
Gold
బంగారం ధరలు ఏ రోజ ఎలా ఉంటాయో చెప్పడం కష్టంగా మారుతోంది. ఒకరోజు తగ్గితే..రెండు రోజలు పెరుగుతోంది. ఈ మధ్య కాలంలో డ్రాస్టిక్ గా పెరిగిన బంగారం ధరలు తర్వాత కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈరజు కూడా బులయన్ మార్కెట్లో బంగారం ధరల్లో తగ్గదల కనిపించింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గింది. దీంతో రూ. 87,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గింది. దీంతో రూ. 95,020 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ, విశాఖల్లో కూడా ఇవే ధరలు ఉన్నాయి. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి ధర రూ. 1,09,100 వద్ద అమ్ముడవుతోంది.
ఇది కూడా చూడండి: Windsor Pro electric SUV: కళ్ళు చెదిరే బుకింగ్స్.. వండర్స్ క్రియేట్ చేస్తున్న 'విండ్సర్ ప్రో' బ్రాండ్ న్యూ కార్..
ఫ్లాట్ గా మార్కెట్...
మరోవైపు దేశీ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా మొదలయ్యాయి. తరువాత నెమ్మదిగా లాభాల బాట పట్టాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు తగ్గి 81,900 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 50 పాయింట్లు తగ్గి 24,900 దగ్గర ఉంది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 20 స్టాక్‌లు పెరుగుతుండగా..టాటా స్టీల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా 1% చొప్పున పెరిగాయి. పవర్ గ్రిడ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, రిలయన్స్ షేర్లు 1% తగ్గాయి. ఇక నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 25 స్టాక్‌లు లాభాల్లో ఉన్నాయి. NSE ఐటీ ఇండెక్స్ 1%, మెటల్ 0.8% పెరిగింది. అదే సమయంలో, ఆటో, మీడియా, రియాల్టీలో దాదాపు 1% క్షీణత ఉంది.
ఇది కూడా చూడండి: Health Risks of Ivy Gourd Curry: లొట్టలేసుకుంటూ దొండకాయ కర్రీ లాగించేస్తున్నావా..? బీ కేర్‌ఫుల్ బ్రో..
ఇది కూడా చూడండి: Venkatesh - Trivikram: ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ భారీ మల్టీస్టారర్..?
పెరుగుతున్న అంతర్జాతీయ మార్కెట్..
ఆసియా మార్కెట్లలో, జపాన్ నిక్కీ దాదాపు 200 పాయింట్లు పెరిగి 37,700 వద్ద ట్రేడవుతోంది. కొరియా కోస్పి దాదాపు 10 పాయింట్లు పెరిగి 2,610 దగ్గర ఉంది. చైనావైన హాంగ్ సెంగ్ సూచీ దాదాపు 300 పాయింట్లు పెరిగి 23,630 వద్ద ట్రేడవుతుండగా.. షాంఘై కాంపోజిట్ 13 పాయింట్లు పెరిగి 3,380 వద్దకు చేరుకుంది. ఇక అమెరికా విషయానికి వస్తే..
మే 19న డౌ జోన్స్ 137 పాయింట్లు పెరిగి 42,792 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ , ఎస్ అండ్ పి 500 19,215 5,963 వద్ద స్థిరంగా ముగిశాయి.
ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
today-latest-news-in-telugu | gold-and-silver | stock-market | update