X Money : ఫోన్ పే, గూగుల్ పేలకు ఇక గుడ్‌బై.. త్వరలో XMoney సర్వీస్

ఎలన్ మస్క్ ఎక్స్ నుంచి Xmoney అనే డిజిటల్ వ్యాలెట్ సర్వీస్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు X సీఈఓ లిండా యాకారినో తెలిపారు. వినియోగదారులకు వీసా డైరెక్ట్ ద్వారా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ పేమెంట్స్ చేసుకునే ఆప్షన్ తీసుకురానున్నట్లు ప్రకటించారు.

New Update
X money app

X money app Photograph: (X money app)

X Money: యూపీఐ పేమెంట్స్ సర్వీస్ ఫోన్ పే, గూగుల్ పేలకు ఇక గడ్డుకాలమే. డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి ఎలన్ మస్క్ దిగుతున్నారు. ఎక్స్ మనీ అనే కొత్త ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ఫ్లాట్ ఫాంను ఏర్పాటు చేయాలని ఆ కంపెనీ నిర్ణయించుకుంది. ఈమేరకు X సీఈఓ లిండా యాకారినో ఈ విషయాన్ని ఆమె అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించారు. ఈ సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్ బిగ్ అనౌన్స్‌మెంట్ ఇస్తామని ఆమె పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : Mutual Fundsలో పెట్టుబడి పెడుతున్నారా?.. అయితే, ఈ షాకింగ్ విషయాలు మీ కోసమే..!

X-Visa పాట్నర్షిప్‌తో X వాలెట్ సర్వీస్‌ని అందుబాటులోకి తీసుకొస్తామని ఆమె పోస్ట్ చేశారు. వినియోగదారులకు వీసా డైరెక్ట్ ద్వారా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్, డిజిటల్ పేమెంట్స్ చేసుకునే ఆప్షన్ తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీంతో బ్యాంక్ అకౌంట్, డెబిట్ కార్డ్ లింక్ చేసుకొని XMoney వ్యాలెట్‌ క్రియేట్ చేసుకోవచ్చు. గతంలో కూడా ఎలన్ మస్క్ ఎక్స్ లో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ట్విటర్‌ను ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత దాని పేరు, లోగో లాంటా అనేక కీలక మార్పులు చేశారు. Xమనీ సర్వీస్ నుంచి యాప్ ద్వారా ఫైనాన్సిషియల్ సర్వీస్ అందించనున్నారు. 

ఇది కూడా చదవండి : కుప్పలు కుప్పలుగా పుట్టుకొస్తున్న చైనా AI మోడల్స్.. మొన్న డీప్‌సీక్, నేడు అలీబాబా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు