/rtv/media/media_files/2025/01/29/OSoMK7qnxkjoQ9n3KlYk.jpg)
alibaba AI Photograph: (alibaba AI)
డ్రాగెన్ దేశం చైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో రోజుకో రికార్డ్ సృష్టిస్తోంది. డీప్‌సీక్ పేరు వచ్చిన ఓ స్టార్ట్‌అప్ అమెరికాని ఆర్థికంగా చావుదెబ్బ కొట్టగా.. తాజాగా మరో చైనా కంపెనీ ఇంకో కొత్త ఏఐ మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. చైనీస్ టెక్ కంపెనీ అలీబాబా 9988.HK బుధవారం క్వెన్ 2.5 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ న్యూ వెర్షన్‌ను రిలీస్ చేసింది. ఈ ఏఐ మోడల్ కొద్ది రోజుల్లోనే ఫేమస్ అయిన డీప్‌సీక్ కంటే కూడా బెటర్‌గా పని చేస్తోందని అలీబాబా కంపెనీ చెబుతోంది. OpenAI, Meta, చాట్ జీపీటీ, డీప్‌సీక్, లామా ల కంటే క్వెన్ 2.5 ఏఐ మోడల్ మెరుగైన సేవలు అందిస్తోందని అలీబాబా క్లౌడ్ యూనిట్ అధికారిక WeChat ఖాతాలో పోస్ట్ చేసింది. డీప్‌సీక్ మాత్రం రిలీస్ అయిన వారం రోజుల్లోనే డౌన్ లోడ్లు వెల్లవెత్తుతున్నాయి. ఒక్క అమెరికాలోనే కాదు మొత్తం 51 దేశాల్లో డీప్‌సీక్ ప్లేస్టోర్ డౌన్‌లౌడ్లలో టాప్ లో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో డీప్‌సీక్ R1 సంచలనం సృస్టిస్తోంది.
Also Read: Suryapet Murder: చంపింది నాన్నమ్మనే.. ప్రైవేట్ పార్ట్స్‌ను కసితీరా తొక్కి.. భార్గవి సంచలన నిజాలు!
The burst of DeepSeek V3 has attracted attention from the whole AI community to large-scale MoE models. Concurrently, we have been building Qwen2.5-Max, a large MoE LLM pretrained on massive data and post-trained with curated SFT and RLHF recipes. It achieves competitive… pic.twitter.com/oHVl16vfje
— Qwen (@Alibaba_Qwen) January 28, 2025
కేవలం 20 నెలల కిందటే అలీబాబా ఏఐ కంపెనీ హాంగ్‌జౌలో స్థాపించబడింది. AI రంగంలో తక్కువ ధర, బెటర్ పెర్ఫామెన్స్‌తో ఏఐలో సర్వీస్ అందిస్తోంది. వరుసగా చైనా కంపెనీలో ఏఐ రంగంలో పెట్టబడులు, విజయాలు అమెరికాని ఆందోళనలో పడేస్తున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు స్టాక్ మార్కెట్ లో భారీగా నష్టాలు పాలవుతున్నాయి. 111 దేశాల్లో యాపిల్ స్టోర్, 18 దేశాల ప్లే స్టోర్‌లో ఎక్కువ డౌన్‌లోడ్ చేసుకుంటున్న టాప్ 10 యాప్‌ల్లో డీప్‌సీక్ ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు. టెక్ రంగంలో చైనా ఏ లెవల్ లో సునామీ సృష్టిస్తోందో.. తక్కువ ధరతో స్పీడ్ గా, కచ్చితమైన డేటా అందించడంలో డీప్‌సీక్ దిట్ట. పైథాగరస్ సిద్ధంతాన్ని కేవలం 30 నిమిషాల్లోనే వివరిస్తోందట. అలాంటిది దానికంటే కూడా అలీబాబా క్వెన్ 2.5 బాగా పని చేస్తోందని ఆ కంపెనీ చెబుతోంది.
Also Read: Maha Kumbh Mela 2025: కుంభమేళాలో తొక్కిసలాటతో స్పెషల్ రైళ్లు రద్దు.. రైల్వేశాఖ క్లారిటీ!