Alert : ఫోన్ పే, జీ పే వాడే వారికి అలెర్ట్.. ఎన్నికల అధికారుల నిఘా..!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ అప్రమత్తమయ్యింది. డిజిటల్ చెల్లింపులపై ఈసీ స్పెషల్ నజర్ పెట్టింది. రాజకీయ పార్టీల బ్యాంకుల ఖాతాపై ప్రత్యేక దృష్టి సారించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంతో పోల్చితే ఈ సారి డిజిటల్ చెల్లింపులు రెట్టింపు అయ్యాయి. చిన్న మొత్తాల్లో సొమ్మును గూగుల్ పే, ఫోన్ పై తోపాటు ఇతర యూపీఐ యాప్స్ ద్వారా చెల్లిస్తున్నారు. దీంతో డిజిటల్ పేమెంట్స్ పై ఈసీ నిఘా పెట్టింది. గూగుల్ పే, ఫోన్ పేలో ఓటర్లకు డబ్బులు పంపుతున్న అంశంపై చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమయ్యింది. దీనిలో భాగంగానే పర్సనల్ అకౌంట్స్ తోపాటు రాజకీయ పార్టీల అకౌంట్స్ ఈసీ నజర్ పెట్టింది.