/rtv/media/media_files/2025/11/19/sundar-pichai-2025-11-19-19-42-45.jpg)
Sundar Pichai
గూగుల్ సీఈవో(google-ceo) సుందర్ పిచాయ్(sundar-pichai) కీలక ప్రకటన చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ Artificial Intelligence (AI) చెప్పే ప్రతి విషయాన్ని కూడా గుడ్డిగా నమ్మోద్దని హెచ్చరించారు. అంతేకాదు ఏఐ పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని.. ఈ బుడగా పేలిపోతే ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని అన్నారు. బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కృత్రిత మేధా కేవలం సాంకేతికత మాత్రమే కాకుండా బలమైన సమాచార వ్యవస్థను కలిగి ఉండటం ముఖ్యమని అన్నారు.
Also Read: అయ్యా దేవుడా.. నాలుగేళ్ల బాలుడి ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్
Don't Blindly Trust AI - Sundar Pichai
ప్రజలు కచ్చితమైన సమాచారం కోసం గూగుల్‌ను వినియోగిస్తున్నారని.. దీనికోసం తమ వద్ద ఇతర ఉత్పత్తులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఏదైన సృజనాత్మకంగా రాయాలనుకుంటే ఏఐ టూల్స్ ఉపయోగపడతాయని అన్నారు. అయినప్పటికీ వీటిని గుడ్డిగా నమ్మొద్దని.. సమర్థవంతంగా వాడటం ప్రజలు నేర్చుకోవాలని చెప్పారు. ఇదిలాఉండగా ఈ ఏడాది మేలో గూగుల్ తమ జెమినై చాట్‌బాట్‌లో ఏఐ మోడ్‌ను తీసుకొచ్చింది. నిపుణుడితో మాట్లాడే అనుభవాన్ని ఇది అందిస్తుంది.
Also Read: మోటో నుంచి మరో సూపర్ ఫోన్.. అధునాతన ఫీచర్లతో రెడీ..!
ప్రజలకు తాము కచ్చితమైన సమాచారాన్ని అందించేదుకు కృషి చేస్తున్నామని.. అయితే ఈ ఆధునిక ఏఐ టెక్నాలజీలో కూడా పలు లోపాలు ఉన్నట్లు పిచాయ్ అన్నారు. ప్రస్తుతం ఏఐ బూమ్‌లో కూడా పెట్టుబడులు సహేతుకంగా లేవని తెలిపారు. ఒకవేళ ఏఐ బుడగ పేలినా కూడా దీన్ని తట్టుకోగలిగే శక్తి గూగుల్‌కు కొంత ఉందని తెలిపారు. కానీ ఏ ఇతర కంపెనీ కూడా దీన్ని పూర్తిగా తట్టుకోలేకపోవచ్చని చెప్పారు.
Follow Us