Chips Packet: అయ్యా దేవుడా.. నాలుగేళ్ల బాలుడి ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్

చిప్స్ ప్యాకెట్లలో ఫ్రీగా ఇచ్చే చిన్న బొమ్మలు ఎంత ప్రమాదకరంగా మారిన విషాద ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు పొరపాటున చిప్స్ ప్యాకెట్‌లో వచ్చిన చిన్న ప్లాస్టిక్ బొమ్మను మింగేయడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.

New Update
Odisa boy

చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి చిప్స్ ప్యాకెట్లో చిన్న చిన్న ప్లాస్టిక్ బొమ్మలు పెట్టి అమ్ముతుంటారు. వాటితో ఆడికోడానికి కూడా పిల్లలు ఎక్కవగా అవే చిప్స్ ప్యాకెట్లు కొంటుంటారు. ఆ చిప్స్ ప్యాకెట్లలో ఫ్రీగా ఇచ్చే చిన్న బొమ్మలు ఎంత ప్రమాదకరంగా మారిన విషాద ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు పొరపాటున చిప్స్ ప్యాకెట్‌లో వచ్చిన చిన్న ప్లాస్టిక్ బొమ్మను మింగేయడంతో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.

Also Read :  RTC డ్రైవర్‌ని చితకబాదిన వ్యక్తి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్

Swallowing Toy Found Inside Chips Packet In Kandhamal

Also Read :  జాజ్ చేయాలని భర్త, ప్రెగ్నెన్సీ కావడం లేదని అత్త వేధింపులు.. పాపం చివరికి!

ఈ హృదయ విదారక సంఘటన ఒడిశా కంధమాల్ జిల్లా ముసుమహాపాడలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన రంజిత్ ప్రధాన్ తన నాలుగేళ్ల కుమారుడు బిగిల్ కోసం షాపులో చిప్స్‌ ప్యాకెట్ కొనిచ్చాడు. చిప్స్ తింటున్న క్రమంలో ఆ బాలుడు ఆ బొమ్మను కూడా తినే పదార్థం అనుకొని మింగేశాడు. చిన్నపాటి బొమ్మ కావడంతో అది గొంతులో అడ్డుపడింది. ఊపిరి తీసుకోలేక ఆ బాలుడు విలవిల్లాడిపోయాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ తల్లిదండ్రులు వెంటనే అప్రమత్తమై బాలుడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చాలా ఆలస్యం అయింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. బొమ్మ గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక చిన్నారి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ కళ్లముందే పుత్రశోకాన్ని చూసిన తల్లిదండ్రుల రోదనలు అక్కడ గుండెలు పిండేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు