/rtv/media/media_files/2025/05/08/nKM1MtXHz9dcRrvvW0Og.jpg)
Bill Gates
Bill Gates Foundation: ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ఓ ఫాండేషన్ నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. దాని పేరు గేట్స్ ఫౌండేషన్(Gates Foundation). ఈ ఫౌండేషన్‌కు ఆయన సంపదలో 99 శాతం విరాళంగా ఇచ్చారు. అయితే దాని విలువ ఇప్పుడు అక్షరాల 107 బిలియన్ డాలర్లు. ఇక్కడ ఇంకో సమస్య వచ్చి పడింది. ఈ పెద్ద మొత్తంలో డబ్బు మరో 20సంవత్సరాల్లో ఖర్చు చేయాలి. ఎందుకంటే 2045లో గేట్స్ ఫౌండేషన్ మూసివేయబడుతుంది. ఆయన తన సంపదలో 99శాతం గేట్స్ ఫౌండేషన్‌కు ఇస్తా అని చెప్పినప్పుడు దాని విలువ చాలా తక్కువగా ఉండే కానీ.. ఇప్పుడు ఆ విలువ భారీగా పెరిగింది.
We have an opportunity to save more lives around the world than ever before—and I want to do even more to help. That's why I'm giving away virtually all of my wealth through the Gates Foundation over the next 20 years. pic.twitter.com/Z5o6ggWYGz
— Bill Gates (@BillGates) May 8, 2025
Bill Gates Will Close Gates Foundation In 2045 After Donating 99% Of His Fortunehttps://t.co/fJF6QhzH5t pic.twitter.com/Yv3BWrBa6i
— Forbes (@Forbes) May 8, 2025
Also Read: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!
2045లో గేట్స్ ఫౌండేషన్ ముంగింపు
ప్రపంచ వ్యాప్తంగా పేద, మధ్య తరగతి ప్రజలకు ఆయన గేట్స్ ఫౌండేషన్ ద్వారా విద్యా, వైద్యం అందిస్తున్నారు. గురువారం (నేడు ) ఆయన గేట్స్ ఫౌండేషన్ కాలం మరో 20ఏళ్లలో పూర్తి అవుతుందని చెప్పారు. బిల్ గేట్స్‌తోపాటు వారెన్ బఫెట్‌కు గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలు ఇచ్చారు. 2000లో గేట్స్ ఫౌండేషన్ స్థాపించారు. అందులో ఇప్పటివరకు దాదాపు 41% వారెన్ బఫెట్ ఫండింగ్ చేశారు. మిగిలినది మైక్రోసాఫ్ట్‌లో గేట్స్ సంపాదించిన సంపద నుండి వచ్చింది. రాబోయే 20 సంవత్సరాలలో ఫౌండేషన్ అదనంగా 200 బిలియన్ డాలర్లు ఖర్చు చేయడానికి వీలు కల్పిస్తుంది.
Also Read: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్
The Bill Gates Foundation has officially announced it will be shutting down.
— Shadow of Ezra (@ShadowofEzra) May 8, 2025
The foundation plans to shut down in 20 years—sooner than originally expected—and will invest $200 billion before closing its doors.
Bill Gates says he’ll donate most of his wealth to the foundation… pic.twitter.com/o7knth1LO0
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!
bill-gates | funds | donations | latest-telugu-news