Summer Tips: వేసవిలో ఇలా చేస్తే.. దెబ్బకు ఇల్లు ఏసీలా మారుతుంది! ట్రై చేయండి

వేసవిలో ఏసీ లేకుండానే ఇంటి వాతావరణాన్ని చల్లగా ఉంచేందుకు ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వండి. ఉప్పు నీటితో ఫ్లోర్ కేలీన్ చేయడం, లైట్లు, ఎలక్ట్రానిక్స్ వాడకం తగ్గించడం, ఇంట్లో మొక్కలు పెంచడం ఇంటి వాతావరణాన్ని చల్లబరుస్తాయి.

New Update
house cooling tips in summer

house cooling tips in summer

SUMMER TIPS: బయట ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ సమయంలో ఇంట్లో ఉండలేము.. బయటకు వెళ్లలేము అనే పరిస్థితి ఉంటుంది. ఇంట్లో ఉంటేనేమో ఉక్కపోత.. బయటకు వెళితే మండే ఎండలు. ఇంట్లో ఏసీ ఉంటే పర్వాలేదు. కానీ ఏసీ లేనివారు సెగలు కక్కే వేడితో అల్లాడిపోతారు. ఇలాంటి వారి కోసమే ఈ చిట్కాలు. ఇవి పాటిస్తే మీ ఇల్లు ఏసీ కంటే చల్లగా మారిపోతుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.. 

 ఉదయం కిటికీలు మూసివేయండి

  • ఉదయాన్నే ఇంట్లోకి ఎండ వస్తున్న సమయంలో కిటికీలు మూసివేయాలి. లేదంటే వేడి లోపలికి వస్తుంది. మధ్యాహ్నం వరకు కిటికీ కర్టెన్స్ వేసి ఉంచడం వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది. 

గ్రీన్ కర్టెన్స్ లేదా డార్క్ కర్టెన్స్ 

  • సన్‌లైట్‌  ఇంట్లోకి రాకుండా  బ్లాక్ చేయాలంటే మందమైన కర్టెన్లు లేదా గ్రీన్ షేడ్స్  ఉన్నవి ఉపయోగించండి. ఇవి లోపల చల్లదనాన్ని కలిగిస్తాయి.

ఉప్పు నీటితో ఫ్లోర్ మోపింగ్

  • రోజులో ఒకసారి చల్లటి నీటిలో కొద్దిగా  ఉప్పు వేసి  ఫ్లోర్  క్లీన్ చేయడం వల్ల వేడి తగ్గుతుంది.
summer home tips
summer home tips

 మొక్కలు

  • తులసి , స్పైడర్ ప్లాంట్ వంటి మొక్కలను ఇంట్లో పెంచడం ద్వారా చల్లని వాతావరణాన్ని కలిగిస్తాయి.  తేమ, ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతాయి.

టెర్రస్ పై నీళ్లు

  • ఇంటి టెర్రస్ పై వేడి ఎక్కువైతే  మధ్యాహ్నం సమయంలో కొద్దిగా నీరు చల్లండి. ఇది రూఫ్‌కి చల్లదనాన్ని ఇస్తుంది.

వంటగదిలో ఎక్స్‌హాస్ట్ ఫ్యాన్ 

  • వేసవిలో వంట గదిలో  ఎక్స్‌హాస్ట్ ఫ్యాన్స్ తప్పనిసరిగా ఉంచాలి. ఇది ఇంట్లో వేడి పెరగకుండా ఉండేందుకు సహాయపడుతుంది.  

 సాయంత్రం తరువాత కిటికీలు 

  • వేడి తగ్గిన తరువాత  సాయంత్రం 6 గంటలకు  కిటికీలు తెరిచి గాలిని లోపలికి రానివ్వండి.

లైట్లు, ఎలక్ట్రానిక్స్ తగ్గించండి

  • ట్యూబ్‌లైట్స్, ల్యాప్టాప్‌లు, టీవీలు ఎక్కువ వేడిని  ఉత్పత్తి చేస్తాయి. కావున సమ్మర్ లో వీలైనంత వరకు వీటిని ఆఫ్ చేసి ఉంచడం మంచిది. 

 ఇంట్లో తడి వాతావరణం

  • ఇంట్లోని ఒక మూలలో నీటి కుండలు పెట్టడం లేదా చిన్న ఫౌంటైన్‌లతో పెట్టడం ద్వారా చల్లటి వాతావరణం కలిగిస్తాయి. 

telugu-news | summer-tips | house cooling tips | life-style | latest-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు