కొత్త ఏడాది మొదలైంది. దీంతో బ్యాంకు ఉద్యోగులు అందరూ ఈ ఏడాదిలో ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయని, ఏ పండుగ ఎప్పుడు రాబోతుందని చూస్తుంటారు. ముఖ్యంగా జనవరి నెలలో ఎన్ని సెలవులు ఉంటాయని చెక్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ నెలలో పండుగలు, రిపబ్లిక్ డే ఉన్నాయి. దాదాపుగా ఈ నెలలో సగం రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఎందుకంటే జనవరి 1వ తేదీ నుంచి చూసుకుంటే.. రెండవ, నాల్గవ శనివారాలు, సంక్రాంతి, రిపబ్లిక్ డే, ఆదివారాలు ఇలా అన్ని కలుపుకుంటే 14 రోజులు సెలవులు రానున్నాయి.
ఇది కూడా చూడండి: Kadapa: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
ఏయే రోజులు సెలవులంటే?
జనవరి 1వ తేదీ బుధవారం: నూతన సంవత్సర దినోత్సవం - దేశవ్యాప్తంగా
జనవరి 6 వ తేదీ సోమవారం: గురుగోవింద్ సింగ్ జయంతి - హర్యానా, పంజాబ్‌లో సెలవు
జనవరి 11వ తేదీ శనివారం: మిషనరీ డే - మిజోరం
జనవరి 11వ తేదీ శనివారం: రెండవ శనివారం - దేశవ్యాప్తంగా
జనవరి 12వ తేదీ ఆదివారం: స్వామి వివేకానంద జయంతి - పశ్చిమ బెంగాల్
జనవరి 13 వ తేదీ సోమవారం: లోహ్రీ - పంజాబ్, ఇతర రాష్ట్రాలు
జనవరి 14వ తేదీ మంగళవారం: సంక్రాంతి - అనేక రాష్ట్రాలు
ఇది కూడా చూడండి: AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్
జనవరి 14వ తేదీ మంగళవారం: పొంగల్ - తమిళనాడు, ఆంధ్రప్రదేశ్
జనవరి 15వ తేదీ బుధవారం: తిరువల్లువర్ దినోత్సవం - తమిళనాడు
జనవరి 15వ తేదీ బుధవారం: తుసు పూజ - పశ్చిమ బెంగాల్, అస్సాం
జనవరి 23వ తేదీ గురువారం: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి - అనేక రాష్ట్రాలు
జనవరి 24వ తేదీ శనివారం: నాల్గవ శనివారం - దేశం అంతటా
జనవరి 26వ తేదీ ఆదివారం: గణతంత్ర దినోత్సవం - దేశవ్యాప్తంగా
జనవరి 30వ తేదీ గురువారం: సోనమ్ లోసర్ - సిక్కిం
ఇది కూడా చూడండి: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి!
ఇది కూడా చూడండి: Horoscope 2025: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశుల లిస్ట్ ఇదే!