/rtv/media/media_files/2025/09/04/amazon-great-indian-festival-sale-2025-date-announced-2025-09-04-21-57-14.jpg)
Amazon Great Indian Festival Sale
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మొదలైంది. ఈ సేల్‌లో ప్రైమ్ మెంబర్స్ అందరికంటే ముందుగానే మంచి ఆఫర్లు పొందారు. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ముఖ్యంగా గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇది కూడా చూడండి: Mini Fridge Offers: రూ.2,997కే ఫ్రిడ్జ్.. అమెజాన్‌లో పిచ్చెక్కిపోయే ఆఫర్లు - లిస్ట్ ఇదే..!
ల్యాప్ టాప్స్‌పై ఆఫర్లు..
ఈ సేల్‌లో అనేక గేమింగ్ ల్యాప్‌టాప్(gaming-laptops) లపై భారీ తగ్గింపులు ప్రకటించారు. HP Victus ల్యాప్‌టాప్ అసలు ధర రూ.1.24 లక్షలు కాగా, ఇప్పుడు రూ.1.09 లక్షలకు లభిస్తుంది, అంటే దీనిపై 20% తగ్గింపు ఉంది. Acer Nitro Lite 16 ల్యాప్‌టాప్ అసలు ధర రూ.1.14 లక్షలు అయితే, సేల్ ధర రూ.85,999 మాత్రమే. దీనిపై 24% తగ్గింపు ఉంది. ASUS Vivobook 16X ల్యాప్‌టాప్ అసలు ధర రూ.1.03 లక్షలు కాగా, ఇప్పుడు రూ.67,990కే లభిస్తుంది. దీనిపై అత్యధికంగా 34% తగ్గింపు ఉంది. Lenovo LOQ ల్యాప్‌టాప్ రూ.1.11 లక్షల నుండి రూ.82,190కి తగ్గింది. అలాగే ASUS Gaming V16 (2025) ల్యాప్‌టాప్ రూ.1.14 లక్షల నుంచి రూ.92,899కి లభిస్తుంది. ఈ సేల్‌లో తక్కువ ధర ల్యాప్‌టాప్‌లతో పాటు, ఖరీదైన ప్రీమియం గేమింగ్ ల్యాప్‌టాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. Acer SmartChoice ALG ల్యాప్‌టాప్ రూ.53,990కి లభిస్తుంది. Acer NITRO V 15 ల్యాప్‌టాప్ రూ.74,990కి అందుబాటులో ఉంది. ఈ రెండింటిపైనా 26% తగ్గింపు ఉంది. MSI Katana 15 ల్యాప్‌టాప్ రూ.1,04,990కి, ASUS ROG Strix G16 ల్యాప్‌టాప్ రూ.1,44,990కి లభిస్తున్నాయి. HP Victus ల్యాప్‌టాప్ రూ.1,12,990కి లభిస్తుంది.
ఇది కూడా చూడండి: Saree Offers: చవక చవక.. రెండు శారీలు కొంటే మూడు ఫ్రీ.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు..!
ప్రీమియం గేమింగ్ ల్యాప్‌టాప్స్ విభాగంలో Alienware Area-5116 ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీనిలో Intel Core Ultra 9 275HX ప్రాసెసర్, RTX 5090 GPU, 64GB RAM, 2TB SSD, 240Hz WQXGA డిస్‌ప్లే వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. దీని అసలు ధర రూ.6,07,700, కానీ ఇప్పుడు 20% తగ్గింపుతో కేవలం రూ.4,84,990కే లభిస్తుంది. అలాగే Acer Predator Helios Neo 16S AI, ASUS ROG Strix G16 వంటి మోడల్స్ కూడా గేమర్లను బాగా ఆకర్షిస్తున్నాయి. మొత్తం మీద ఈ సేల్ గేమర్లకు మంచి అవకాశాలను అందిస్తోంది.