Flipkart Offers: రూ.1000లకే 5 చీరలు.. వదిలితే మళ్లీ కొనలేరు..!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కాంబో చీరలపై భారీ ఆఫర్లు ఉన్నాయి. అత్యంత తక్కువ ధరలకు చీరలు కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. కేవలం రూ. 1100లకే ఐదు చీరల ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. మహిళా వినియోగదారులకు ఇది మంచి అవకాశం.

author-image
By Seetha Ram
New Update
saree offers

saree offers

దేశంలోని అతిపెద్ద ఆన్‌లైన్ సేల్స్‌లో ఒకటిగా పేరు పొందిన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మళ్ళీ ప్రారంభమైంది. ఈ సేల్ ఈసారి మహిళలను దృష్టిలో ఉంచుకుని అద్భుతమైన ఆఫర్లను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా చీరల విభాగంలో ఆఫర్లు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పండగలు, శుభకార్యాలు, రోజువారీ వాడకానికి సరిపడే కాంబో చీరల సెట్లపై ఫ్లిప్‌కార్ట్ భారీగా తగ్గింపులను అందిస్తోంది. ఈ ఆఫర్లతో రూ.1000లోపే రెండు లేదా మూడు అందమైన చీరలను సొంతం చేసుకోవచ్చు.

సాధారణంగా ఒక్క చీర ధర రూ.800 నుండి రూ.1500 వరకు ఉంటుంది. కానీ ఈ సేల్‌లో 5 చీరలతో కూడిన కాంబో ప్యాక్ కేవలం రూ.1,100లకే అందుబాటులో ఉంది. ప్యూర్ కాటన్, బనారస్ సిల్క్, జార్జెట్, షిఫాన్, ఆర్ట్ సిల్క్, లెహరియా వంటి అనేక రకాల ఫ్యాబ్రిక్స్‌తో కూడిన చీరలు కూడా ఆఫర్లలో ఉన్నాయి. వివిధ కలర్స్, డిజైన్లు, ఎంబ్రాయిడరీలతో కూడిన కాంబో ప్యాక్స్ యువతులకు, గృహిణులకు ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా పార్టీ వేర్, ట్రెడిషనల్ లుక్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన చీరలు కూడా తక్కువ ధరకే లభిస్తున్నాయి.

ఈ ఆఫర్లకు అదనంగా బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై తక్షణ తగ్గింపులు కూడా ఉన్నాయి. వీటివల్ల చీరల ధర మరింత తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి. అవేంటో చూసేద్దాం. 

Floral Print Daily Wear Georgette Saree

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో Floral Print Daily Wear Georgette Saree అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఇది ఒక కాంబో ప్యాక్. ఇందులో 5 మల్టీకలర్ శారీలు ఉన్నాయి. వీటి అసలు ధర రూ.6,669 ఉండగా.. ఇప్పుడు 82 శాతం భారీ ఆఫర్ లభిస్తోంది. ఈ ఆఫర్‌తో ఈ కాంబో ప్యాక్ కేవలం రూ.1,155లకే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇలా కాకపోతే.. రూ.1,097 + 58 కూపన్ కాయిన్స్‌ను ఉపయోగించి వీటిని కొనుక్కోవచ్చు.

 

Self Design Bollywood Net Saree

Self Design Bollywood Net Saree కాంబో ప్యాక్ కూడా తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. ఈ కాంబో ప్యాక్‌లో రెండు చీరలు వస్తాయి. వీటి ధర రూ.433గా నమోదైంది. 

Advertisment
తాజా కథనాలు