/rtv/media/media_files/2025/05/27/mhgwRIDjLeDBE27GWtEB.jpg)
Airtel Recharge Plans
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ ఇవాళ భారతదేశంలోని ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త OTT రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లు 25కి పైగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను అందిస్తున్నాయి. ఎంట్రీ లెవల్ ప్లాన్ ధర రూ. 279 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఒక నెల వ్యాలిడిటీతో అందుబాటులోకి వచ్చింది. ఇది నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5, సోనీలివ్‌తో సహా ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. దీనితో పాటు ఎయిర్‌టెల్ వరుసగా 28 రోజులు, 84 రోజుల చెల్లుబాటుతో రూ.598, రూ. 1,729 ధరల ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లను కూడా ప్రకటించింది. ఈ ప్లాన్‌లు అపరిమిత 5G డేటా, అపరిమిత కాల్‌లతో వస్తాయి.
Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!
ఆల్-ఇన్-వన్ OTT ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాక్‌లు
ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ఎయిర్‌టెల్ కొత్త ఆల్-ఇన్-వన్ OTT ప్యాక్‌ను ప్రారంభించింది. వీటిలో రూ.179 ప్లాన్, రూ. 279 ప్లాన్, రూ.598 ప్లాన్, రూ. 1,729 ప్లాన్‌లు ఉన్నాయి. ఈ కొత్త ప్లాన్‌లు Netflix, JioHostar, Zee5, SonyLiv, LionsgatePlay, AHA, SunNxt, Hoichoi, ErosNow, ShemarooMe వంటి 25 కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను అందిస్తాయి. ఇది 16 కంటే ఎక్కువ భాషలలో ఇంటరాక్టివ్, లోకల్ కంటెంట్‌ను, ఒకే సబ్‌స్క్రిప్షన్‌లో అపరిమిత 5G డేటాను అందిస్తుంది.
Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!
కొత్త రూ. 279 ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ ఒక నెల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జీ5, జియోహాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియంలకు సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ ప్యాక్‌తో కస్టమర్‌లు రూ. 750 విలువైన అనేక రకాల స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేసుకోవచ్చు.
Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
అలాగే ఇది ఒక నెల చెల్లుబాటుతో రూ. 279 ధరకు ప్రీపెయిడ్ కంటెంట్-ఓన్లీ ప్యాక్‌ను కూడా అందిస్తోంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జీ5, జియోహాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే ప్రీమియం యాక్సెస్‌తో పాటు, రూ. 279 ప్రీపెయిడ్ ప్లాన్ నెలకు 1GB డేటాను అందిస్తుంది. ఇక ఎయిర్‌టెల్ రూ.598 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అపరిమిత 5G డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది.
Also Read: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!
అలాగే OTT ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటును అందిస్తుంది. చివరగా రూ. 1,729 రీఛార్జ్ ప్లాన్ అపరిమిత 5G డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, OTT ప్రయోజనాలను అందిస్తుంది. ఇది 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.
airtel-new-recharge-plans | airtel-prepaid-plans | latest-telugu-news | telugu-news