అహింసా మార్గంతో పోరాటం చేయవచ్చని నీరూపించిన మహానుభావుడు మహత్మాగాంధీ అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 140 కోట్ల మంది భారతీయులకు 77వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నేడు ముగ్గురిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హింసకు దూరంగా ఉండి దేశానికి మహాత్మగాంధీ స్వాతంత్ర్యం తీసుకొచ్చారని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కులు కల్పించారని గుర్తు చేశారు. అంతే కాకుండా కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న దేశ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిచిన గొప్పనేత జవహార్ లాల్ నెహ్రూ అన్నారు. ఈ ముగ్గురిని స్మరించుకొని వారికి నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
పూర్తిగా చదవండి..Revanth Reddy: వారి ఆశయాలను బ్రిటిష్ జనతా పార్టీ నాశనం చేస్తోంది
దేశ వ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఆయన.. మహత్మా గాధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూలను స్మరించుకున్నారు.
Translate this News: