/rtv/media/media_files/2025/10/25/black-fungus-2025-10-25-11-56-46.jpg)
black fungus
ఉల్లిపాయలు ఆహారంలో ముఖ్యమైన భాగం. అయితే సాధారణంగా ఆరోగ్యానికి మేలు చేసే ఉల్లిపాయలు కొన్నిసార్లు నల్లటి మచ్చలతో కనిపిస్తాయి. ఇలా నల్లటి ఫంగస్ పెరిగిన ఉల్లిపాయలను తినడం ఆరోగ్యానికి హానికరం. ఈ ఫంగస్‌ను ఆస్పెర్‌గిల్లస్ నైగర్ ( Aspergillus niger) అని పిలుస్తారు. ఇది సాధారణంగా నేలలో కనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉల్లిపాయలు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. నల్లటి ఫంగస్ ఉన్న ఉల్లిపాయలను తినడం వలన అలెర్జీలు, తలనొప్పి, కడుపు నొప్పి, అతిసారం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరించారు. ఉల్లిపాయలలో బ్లాక్ ఫంగస్‌కు ఎందుకు ప్రమాదకరమో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఉల్లిపాయలపై ఫంగస్ పెరగడానికి కారణం..
ఉల్లిపాయలు భూమిలో పెరుగుతాయి కాబట్టి నేలలో ఉండే ఫంగస్ ఉల్లిపాయలకు చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫంగస్‌తో కూడిన ఉల్లిపాయలను తిన్న తర్వాత కొంతమందిలో అలెర్జీలు సహా వివిధ రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉల్లిపాయను తొక్క తీసిన తర్వాత దాని ఉపరితలంపై నల్లటి మచ్చలు కనిపిస్తే.. అది ఫంగస్ ఉన్నట్లు అర్థం. ఈ నల్లటి మచ్చలు చేతితో రుద్దితే రాలిపోయే విధంగా ఉంటాయి. ఈ బ్లాక్ ఫంగస్‌కు ఆస్పెర్‌గిల్లస్ నైగర్ అనే ఫంగస్ కారణం. అయితే ఈ నల్లటి ఫంగస్ ప్రాణాంతకమైన తీవ్రమైన వ్యాధి కానప్పటికీ.. అలెర్జీలు, ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ఉదయం 30 సెకన్ల హగ్‌తో.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?
ఇప్పటికే ఏదైనా రకమైన అలెర్జీ ఉన్నవారు అస్సలు ఇలాంటి ఉల్లిపాయలను తినకూడదు. నల్లటి ఫంగస్ ఉన్న ఉల్లిపాయలను తినడం వలన తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి, అతిసారం వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. ఉల్లిపాయపై నల్లటి మచ్చలు కనిపిస్తే.. దానిని పూర్తిగా శుభ్రం చేయాలి. ఒకటి లేదా రెండు పొరలను అదనంగా తొలగించిన తర్వాత మాత్రమే ఉల్లిపాయను ఉపయోగించాలి. ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం మానుకోవాలి. ఎందుకంటే ఫ్రిజ్‌లో ఉంచితే ఫంగస్ పెరిగే ప్రమాదం పెరుగుతుంది. ఉల్లిపాయను ఉపయోగించే ముందు దానిపై నల్లటి మచ్చలు లేవని నిర్ధారించుకోవాలి. నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలను తినకుండా ఉండటం ఉత్తమం. కుటుంబ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఉల్లిపాయలను వినియోగించేటప్పుడు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఈ ఆకు అమృతం లాంటిది.. దీన్ని తింటే శరీరానికి ఎన్నో లాభాలు
Follow Us