ఆగేదే లేదు...పరిస్థితులు ఎలా ఉన్నా భగవంత్ కేసరి వచ్చేస్తాడు

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా భగవంత్ కేసరి. భారీ బడ్జెట్ తో షైన్ స్క్రీన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఈ సినిమా విడుదల ఆగిపోతుంది అనుకున్నారు అంతా. కానీ అలాంటిదేమీ లేదని అనుకున్న టైమ్ కే వచ్చేస్తామని చెపపారు మూవీ మేకర్స్.

New Update
ఆగేదే లేదు...పరిస్థితులు ఎలా ఉన్నా భగవంత్ కేసరి వచ్చేస్తాడు

కెరియర్ లో ఫెయిల్యూర్ లేకుండా వరుసగా ఐదు సక్సెస్ లతో జోరు మీద ఉన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. బాలయ్య బాబుతో ఇతను తీస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈ మూవీతో డబుల్ హ్యాట్రిక్ ని తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నాడు దర్శకుడు. దసరాకి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ విషయాన్ని రీసెంట్ గా పోస్టర్ విడుదల చేసి మరీ అనౌన్స్ చేశారు. భగవంత్ కేసరి మూవీలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బాలయ్య బాబుకి జోడీగా కనిపిస్తోంది.

ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. బాలయ్య నుంచి ఫ్యాన్స్ కోరుకునే పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్, డైలాగ్స్ తో పాటుగా అనిల్ రావిపూడి స్టైల్ ఫన్ కూడా సినిమాలో ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఏపీలో రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలో బాలయ్య ఫోకస్ అంతా కూడా అటువైపే ఉంది. ఈ కారణంగా రిలీజ్ వాయిదా పడొచ్చు అంటూ సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే వీటిలో ఎలాంటి వాస్తవం లేదని చిత్ర యూనిట్ తాజాగా ఒక పోస్టర్ తో కన్ఫర్మ్ చేసింది. షూటింగ్ చివరి దశకి వచ్చేసిందని, చెప్పిన టైంకి చెప్పినట్లు మూవీ రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో భగవంత్ కేసరి మూవీ రిలీజ్ వాయిదా పడుతుందనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లు అయ్యింది. ఈ సినిమా వరకూ ఓకే కానీ తరువాత వచ్చే సినిమాలు మాత్రం షూటింగ్ కు వెళ్ళడమే ఆలస్యమవ్వొచ్చని చెబుతున్నారు.

Advertisment
తాజా కథనాలు