author image

srinivas

By srinivas

ముంబైలో చెంబూర్‌ ప్రాంతంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఏడుగురు కుటుంబసభ్యులు సజీవ దహనమయ్యారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. ప్రమాదం జరిగినప్పుడు వారంతా గాఢనిద్రలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. 

By srinivas

బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం గ్వాలియర్ వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా గెలిచింది. 128 పరుగుల లక్ష్యాన్ని 49 బాల్స్ మిగిలుండగానే ఛేదించింది. 

By srinivas

దుబాయ్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ & వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో జరుగుతున్న సంబరాలకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. RTV మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.

By srinivas

చెన్నై మెరీనా బీచ్‌లో దారుణం జరిగింది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘మెగా ఎయిర్‌ షో’లో విషాదం చోటుచేసుకుంది. ఈ షోను వీక్షించేందుకు లక్షలాదిమంది తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. నలుగురు మృతి చెందగా 100 మందికిపైగా గాయపడ్డారు. Latest News In Telugu

By srinivas

కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నది అర్బన్ నక్సల్స్ మూఠాలేనంటూ ప్రధాని మోదీ సంచలన కామెంట్స్ చేశారు. ప్రమాదకరమైన కాంగ్రెస్ పార్టీ ఎజెండాను తిప్పికొట్టడానికి దేశప్రజలంతా ఏకం కావాలని మహారాష్ట్రలోని వాశిం జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పిలుపునిచ్చారు. 

By srinivas

వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి ప్రేమ జంట మరోసారి వార్తల్లో నిలిచింది. భార్య వాణితో విభేదాల తర్వాత పర్మనెంట్‌గా మాధురితోనే ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ ఆదివారం మాధురిని స్కూటీపై ఎక్కించుకుని రోడ్లపై చక్కర్లు కొట్టారు. Latest News In Telugu

By srinivas

మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు బోణీ కొట్టింది. దాయాది పాకిస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆదివారం షార్జా వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో గెలిచి సెమీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఏడు బంతులు మిగిలి ఉండగానే 106 పరుగుల లక్ష్యాన్ని ఛేధించింది. Latest News In Telugu

By srinivas

తెలంగాణ పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. అగ్రరాజ్యం అమెరికా బతుకమ్మను అధికారక పండుగగా గుర్తించింది. నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్‌ నగరం, వర్జీనియా రాష్ట్రాల మేయర్‌, గవర్నర్‌లు బతుకమ్మను 'తెలంగాణ హెరిటేజ్ వీక్‌'గా పేర్కొంటూ అధికార ప్రకటనలు విడుదల చేశారు.

By srinivas

ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తే తాను బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని కేజ్రీవాల్ అన్నారు. దీనికి మోదీ సిద్ధంగా ఉన్నారా అంటూ ‘జనతా కీ అదాలత్‌’ బహిరంగ సభలో సవాల్ విసిరారు. హరియాణా, జమ్మూకశ్మీర్‌లో బీజేపీ పతనం ఖాయమేనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By srinivas

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం వేళ బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్‌ .. కల్తీ నెయ్యికి చెక్ పెట్టాలంటే తిరుమలకు సొంత డైయిరీ ఉండాలని.. వెయ్యి ఆవులను ఉచితంగా ఇస్తానన్నాడు. Latest News In Telugu Short News

Advertisment
తాజా కథనాలు