TG Mega Job Mela: తెలంగాణలో మెగా జాబ్ మేళా.. 150 కంపెనీల్లో 5 వేల జాబ్స్.. ఇలా నమోదు చేసుకోండి!

ఉద్యోగాల కోసం తంటాలు పడుతున్న తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మంత్రి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో అక్టోబర్ 25న హుజూర్‌నగర్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు.

New Update
job (1)

TG Mega Job Mela: ఉద్యోగాల కోసం తంటాలు పడుతున్న తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మంత్రి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో అక్టోబర్ 25న హుజూర్‌నగర్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 150కి పైగా కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొంటుండగా 5000లకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 

10వ తరగతి అర్హతతో..

ఈ మేరకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL), తెలంగాణ డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ (DEET) సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఐటీ, ఫార్మా, ఇ-కామర్స్, ట్రేడ్, మాన్యుఫ్యాక్చరింగ్, ఐటీఈఎస్, బీపీఓ, బయోటెక్నాలజీ రంగాలకు చెందిన కంపెనీలు ఇందులో పాల్గొంటాయి. 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల వరకు అర్హత కలిగిన అభ్యర్థులు హాజరై కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. హుజూర్‌నగర్, కోదాడ ప్రాంతాల యువతకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. 

Also Read :  శ్రీలీల షాకింగ్ సర్ప్రైజ్! ఎవరీ 'ఏజెంట్ మిర్చి'..?

అర్హతలు
పదవతరగతి ఉత్తీర్ణత. ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, MBA, B.Tech, PG, ఫార్మీసీ పూర్తి చేసి ఉండాలి.

వయసు
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు 18-40 ఏళ్లలోపు ఉండాలి. 

జాబ్ మేళా అడ్రస్
అక్టోబర్ 25న..పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక హూజుర్ నగర్ పట్టణం. ఏదైనా సహాయం కొరకు ఈ నెంబర్లను సంప్రదించండి. 91-9000937805, +91 9848997050, +91 9848409466 

Also Read :  ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!

ఇదిలా ఉంటే.. ఐటీ ఉద్యోగంలో చేరాలనుకుంటున్న అభ్యర్థులకు అదిరిపోయే శుభవార్త అందింది. లండన్‌లో కొత్త AI స్టూడియోను ప్రారంభించన్నారు. దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పీరియన్స్ జోన్ అండ్ డిజైన్ స్టూడియో అని పేరు పెట్టారు. ఈ క్రమంలోనే కొత్తగా నియమకాన్ని చేపట్టనుంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్‌పీరియన్స్ జోన్, డిజైన్ స్టూడియోలో భారతీయులకు కూడా ప్రాధాన్యత ఉండబోతోంది. మొత్తం 5 వేల నియామకాలను చేపట్టనుంది. దీనికి ఏఐ ఇంజనీరింగ్ చదువుతున్న భారతీయ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏఐ రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. కొత్తగా సాంకేతిక పరిష్కారాలను అందించడంలో ఈ స్టూడియో కీలక పాత్ర కూడా పోషించనుంది. 

Advertisment
తాజా కథనాలు