Crime: కొంపముంచిన మద్యం.. రైలుకింద నలిగిపోయిన అందమైన కుటుంబం!

మాయదారి మద్యం కుటుంబాలను బలితీసుకుంటూనే ఉంది. మద్యం మత్తుకు అలవాటైన కొంతమంది పురుషులు పచ్చని సంసారాలను అప్పులపాలు చేస్తూ నడిరోడ్డున పడేస్తుంటే.. మరికొందరు ఏకంగా తాగేందుకు డబ్బుల కోసం ప్రాణాలు తీస్తున్నారు.

New Update
kadapa

Kadapa: మాయదారి మద్యం కుటుంబాలను బలితీసుకుంటూనే ఉంది. మద్యం మత్తుకు అలవాటైన కొంతమంది పురుషులు పచ్చని సంసారాలను అప్పులపాలు చేస్తూ నడిరోడ్డున పడేస్తుంటే.. మరికొందరు ఏకంగా తాగేందుకు డబ్బుల కోసం ప్రాణాలు తీస్తున్నారు. ఇంకా కొందరు పీకలదాకా తాగి క్షణికావేశంలో చేయరాని తప్పులు చేస్తున్నారు. వారి ఆనందాలు, కోపాలు, ఇగోను సంతృప్తి పరిచేందుకు అమాయకులను బలితీసుకుంటున్నారు. ఈ క్రమంలో అభం శుభం తెలియని పసిపిల్లలను కూడా హతమారుస్తున్న ఘటనలు ఇప్పటికే కలవరపెడుతుంటే.. తాజాగా ఏపీలోని కడప జిల్లాలో మద్యం మత్తు ఓ అందమైన కుటుంబాన్ని చిదిమేసింది. 

Also Read :  తెలంగాణలో లక్షల కొద్ది కిడ్నీ, క్యాన్సర్ కేసులు.. వణుకు పుట్టిస్తున్న ఆరోగ్యశాఖ లేటెస్ట్ లెక్కలు!!

తాగినమైకంలో గొడవ..

ఈ మేరకు ఘటన వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా శంకరాపురానికి చెందిన శ్రీరాములు(27), రవళి(23) భార్యాభర్తలు. వీరికి రిత్విక్(16 నెలలు) కొడుకు ఉన్నాడు. అయితే శ్రీరాములుకు అప్పుడప్పుడు మద్యం తాగే అలవాటు ఉంది. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వెళ్లగా ఓ విషయంలో కుటుంబసభ్యులతో గొడవపడ్డాడు. గొడవ పెద్దది కావడంతో ఇంట్లోవాళ్లు తీవ్రంగా మందలించారు. దీంతో మద్యం మత్తులో మనస్థాపానికి గురైన శ్రీరాములు.. ఇదే కోపంలో భార్య, కొడుకును ఆటోలో బయటకు తీసుకెళ్లాడు. అనంతరం క్షణికావేశంలో వారిద్దరినీ తీసుకుని కడప రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో నెంబర్ ట్రాక్‌పై నిలబడ్డాడు. అదే సమయంలో వచ్చిన గూడ్స్ రైలు వారిని ఢీకొట్టడం(hit by train) తో మగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 

Also Read :  తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!

16 నెలల పసిగుడ్డు

అయితే ఈ వార్త తెలియగానే శ్రీరాములు నాయనమ్మ వెంకట సుబ్బమ్మ(71) కంగుతిన్నది. కన్నీరుమున్నీరుగా రోదిస్తుండగా ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆ వృద్ధురాలు సైతం ప్రాణాలు విడిచింది. ఈ దారుణమైన ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువులు, స్థానికులు బోరున విలపించారు. 16 నెలల పసిగుడ్డును చూసి గుండెలు బాదుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. కైలాష్ భవన్ రోడ్డులోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద జూటూరి బుజ్జి (50) అనే వ్యక్తిని దుండగుడు దారుణంగా హత్య చేశాడు. స్థానిక సమాచారం మేరకు.. గుర్తుతెలియని దుండగుడు కొబ్బరికాయలు కొట్టే కత్తితో నరికి బుజ్జిని చంపినట్లు తెలుస్తోంది. ఈ హఠాత్తు‌ పరిణామంతో స్థానికంగా కలకలం రేగింది. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతుడు అమర్తలూరు మండలం కోడితాడిపర్రు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బుజ్జి చెంచుపేటలో ఉన్న తన కూతురి ఇంటికి వచ్చి టిఫిన్ చేయడానికి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘోరం జరిగిందనట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు