తమిళనాడులో ఎన్‌కౌంటర్ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున గూడువంచెరి మండలం తాంబరం పరిధిలో జరిగిన పోలీసుల కాల్పుల్లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు.

BalaMurali Krishna
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. కాచిగూడ- యశ్వంత్‌పూర్ మధ్య నడవనున్న రైలు ఇప్పటికే ట్రయల్ రైన్ పూర్తిచేసుకుంది. ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ఈ ట్రైన్‌ను ప్రారంభించనున్నారు.
మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా గవర్నర్ కోటాలో శాసనమండలికి పంపేందుకు దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే గవర్నర్‌కు పంపించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ సీనియర్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అద్భుతంగా ముగింపు పలికాడు. కెరీర్ చివరి ఓవర్లలో రెండు వికెట్లు ఇంగ్లీష్ జట్టుకు సూపర్ విక్టరీ అందించాడు. దీంతో ఐదు టెస్టుల ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ 2-2తో సమం అయింది.
అర్బన్ ప్రాంతాల్లో కూడా డిజిటల్ లైబ్రరీలను తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలన్నారు. అలాగే డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపై కూడా చొరవ తీసుకోవాలని సూచించారు.
సినీ హీరో మంచు మనోజ్ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా? ఇప్పటికే నియోజకవర్గం కూడా ఖరారు అయిందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరి ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? ఏ పార్టీ బీఫాం నుంచి పోటీ చేయనున్నారో? ఇప్పుడు తెలుసుకుందాం.
ఒడిశా.. ఈ పేరు వినగానే దేశం మొత్తానికి ఇంకా ఘోర రైలు ప్రమాదమే గుర్తుకొస్తుంది. ఆ బాధ నుంచి ఇంకా కోలుకోక ముందే ఇటీవల కాలంలో ఆ రాష్ట్రంలో వరుస ప్రమాదాలు జనాలను కలవరపరుస్తున్నాయి. తాజాగా నిర్మాణంలో ఉన్న కల్వర్టు కూలి ఐదుగురు దుర్మరణం చెందారు.
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. రాజధాని అమరావతి ప్రాంతం వెలగపూడిలోని వీరభద్రస్వామి ఆలయానికి దర్శనం కోసం వెళ్లారు. విషయం తెలుసుకున్న రాజధాని రైతులు రాయుడిని అడ్డుకున్నారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో మరో కీచక పోలీస్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసే వేధింపులకు గురి చేశాడు. సమస్య ఉందని ఆశ్రయించిన ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్(సీఐడీ) డీఎస్పీ కిషన్ సింగ్‌పై చైతన్యపురి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.