author image

B Aravind

Weather Alert: ఈసారి ముందుగానే రానున్న రుతుపవనాలు
ByB Aravind

ఈసారి మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు రానున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. మే 22కు బదులు.. మే 19వ తేదీనే రుతుపవనాలు అండమాన్‌ నికోబార్‌ను తాకనున్నాయని పేర్కొంది. జూన్ 1లోగా కేరళకు రుతుపవనాలు చేరే అవకాశం ఉందని తెలిపింది.

Israel-Hamas: గాజాలో విషాదం.. ఐరాసతో కలిసి పనిచేస్తున్న భారతీయుడు మృతి
ByB Aravind

ఐక్యరాజ్యసమితితో కలిసి గాజాలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఓ భారతీయుడు మృతి చెందారు. మృతుడు ఐరాసలోని భద్రత, రక్షణ విభాగంలో(DSS) పనిచేస్తున్నారు. రఫాలోని యూరోపియన్ ఆసుపత్రికి వెళ్తుండగా.. ఆయన వాహనంపై దాడి జరిగింది.

Telangana: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు
ByB Aravind

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా.. 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మే 27 ఈ పట్టభద్రుల ఎన్నికల జరగనుంది.

Telangana: ఆ ప్రాంతంలో 100 శాతం పోలింగ్.. ఎక్కడంటే
ByB Aravind

మెదక్‌ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100 శాతం ఓటింగ్ నమోదైంది. ఆ తండాలో 95 మంది పురుషులు, 115 మంది మహిళలలతో కలిపి మొత్తం 210 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఆదర్శంగా నిలిచారు.

Telangana: ముగ్గురు నేతలపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్..
ByB Aravind

మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ మంత్రి కేటీఆర్, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ.. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ముగ్గురు నేతలపై చర్యలు తీసుకోవాలని కోరింది.

Advertisment
తాజా కథనాలు